కోడ్ ఉల్లంఘన: హేమామాలినికి ఈసి హెచ్చరిక

వివిధ వార్తా పత్రికల్లో మూడు ప్రకటనలు తనకు మద్దతుగా ప్రచురితం చేయించుకున్నందుకు జిల్లా మెజిస్ట్రేట్, రిటర్నింగ్ అధికారి విశాల్ చౌహాన్.. జయంత్ చౌధరికి హెచ్చరికలు జారీ చేశారు. మీడియా సెర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ అనుమతి లేకుండా ప్రకటనలు జారీ చేయడం నేరమని చెప్పారు.
ఇదే విధమైన అభియోగాలే ఎదుర్కొంటున్న బిజెపి నేత హేమామాలినికి కూడా ఈసి హెచ్చరికలు జారీ చేసింది. మీడియా సెర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ(ఎంసిఎంసి) అనుమతి లేకుండా తనకు మద్దతుగా ఒక ప్రకటన ప్రచురితం చేసుకున్నందుకు హేమామాలినిని కూడా ఈసి హెచ్చరించింది.
ఇలాంటి చర్యలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హేమామాలిని, జయంత్‌లకు ఈసి హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలు పత్రికల్లో ప్రచురితం చేయాలనకుంటే ఎంసిఎంసి నుంచి మూడు రోజుల ముందే అనుమతి తీసుకోవాలని తెలిపింది.












Click it and Unblock the Notifications