టీవీ రిపోర్టర్ల దందా: డబ్బులు గుంజుతుండగా పోలీసుల పట్టివేత
విశాఖపట్నం: గంజాయి స్మగ్లర్ల నుంచి డబ్బులు గుంజేందుకు మాటు వేసిన ఎలక్ర్టానిక్ మీడియా విలేకరులను పోలీసులు పట్టివేశారు. విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలానికి చెందిన ఎలక్ర్టానిక్ మీడియా ప్రతినిధులు ఎస్.రమేష్, ఎస్.ప్రసాద్‌లతోపాటు మరికొంతమంది శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వడ్డాది వద్ద మాటువేశారు.
ఆ మార్గంలో గంజాయితో వచ్చే వాహనాలను ఆపి డబ్బు గుంజాలని ఎత్తు వేశారు. ఇంతలో ఒడిశా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉన్న ఒక కారు అటుగా వచ్చింది. అది గంజాయి అక్రమ రవాణా వాహనమేనని భావించిన మీడియా ప్రతినిధులు కర్రలతో రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆ వాహనాన్ని నిలిపివేశారు. కారును తనిఖీ చేయాలని లోపలున్నవారిని గద్దించారు.

దాంతో కథ అడ్డం తిరిగింది. వారు అనుకున్నట్టు లోపల ఉంది గంజాయి స్మగ్లర్లు లేరు. అందులో స్పెషల్ పార్టీ పోలీసులున్నారు. వారి సీఐ కె.సూర్యనారాయణ కూడా కారులోనే ఉన్నారు. మీడియా హడావుడిని గమనించిన ఆయన తనిఖీ చేయడానికి మీరెవరంటూ వారిని నిలదీశారు. గంజాయి రవాణా చేస్తున్న వాహనం వస్తోందని సమాచారం రావడంతో కాపు కాశామని వారు ఆయనకు చెప్పారు.
వాహనాన్ని అడ్డుకునేందుకు కర్రలు దేనికంటూ ఇద్దరు మీడియా ప్రతినిధులనూ పట్టుకుని బుచ్చెయ్యపేట పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై సీఆర్‌పీసీ 170, 353, 341, 342, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం వారు బెయిలుపై విడుదలయ్యారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications