కేంద్రం ఇచ్చిన వరంతో విశాఖతో సహా ఏపీలోకి 8జిల్లాలకు మహర్దశ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అడుగడుగునా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ అభివృద్ధికి దోహదం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. నీతి అయోగ్ ప్రవేశపెట్టిన వీఈఆర్ ప్రాజెక్టు ఏపీలోని 8 జిల్లాల ప్రజలకు ఒక వరంగా మారబోతుంది.
విశాఖ ఎకనమిక్ జోన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు
నీతి అయోగ్ చేపట్టిన విశాఖ ఎకనమిక్ రీజియన్ ప్రాజెక్ట్ లో భాగంగా గ్రేటర్ విశాఖ ఎకనమిక్ జోన్ ఏర్పాటు చేయడానికి ఏపీలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 2047 నాటికి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఇటీవల మంత్రి లోకేష్ విశాఖ పర్యటనలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆ జిల్లాలకు మహర్దశ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టి తదనుగుణంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విశాఖ ప్రాంత అభివృద్ధి కోసం, విశాఖను దేశంలోనే కీలక ఆర్థిక కేంద్రంగా మార్చాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ జోన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలను కలిపి ఎకనమిక్ జోన్ గా అభివృద్ధి చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
భూసేకరణకు రంగం సిద్ధం
నీతి ఆయోగ్ ప్రవేశపెట్టిన వీఈఆర్ ప్రాజెక్టులో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం సహా ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 20 వేల ఎకరాల భూసేకరణకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి మూడు నుండి ఐదు వేల ఎకరాలు, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల నుండి 15 వేల ఎకరాలు ప్రభుత్వ ప్రైవేటు భూములను సేకరించాలని అధికారులు భావిస్తున్నారు.
వీఈఆర్ ప్రాజెక్ట్ కు సమగ్ర ప్రణాళికలు
సేకరించిన ఈ భూములను జాతీయ రహదారులకు అనుసంధానం చేసి, మౌలిక వసతుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నారు. గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్ జోన్ అభివృద్ధికి ఏడు కీలక అంశాలను ప్రధానంగా తీసుకున్న నీతి అయోగ్ పోర్ట్ ల ద్వారా వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఐటీ హబ్ లను ఇన్నోవేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
నీతి ఆయోగ్ దృష్టి పెట్టిన ప్రధాన ఏడు అంశాలు ఇవే
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆరోగ్య సౌకర్యాలను కల్పించాలని, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించాలని, నగరం పట్టణాల అభివృద్ధికి, రోడ్లు, రైల్వే వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం నీతి అయోగ్ నిర్ణయించిన ఎనిమిది జిల్లాలలో ప్రస్తుతం స్థూల దేశీయ ఉత్పత్తి 49 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఇదే
2032 నాటికి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థను 120 బిలియన్ డాలర్లకు విస్తరించాలని ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2032 నాటికి 20 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయి అని కూడా ఒక అంచనా. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది.
కేంద్ర సహకారంతో విశాఖ ఆర్ధిక ప్రగతి
2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలంటే గ్రేటర్ విశాఖ జోన్ ఆర్థిక అభివృద్ధి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని పెట్టుకొని ప్రణాళికలు రూపొందించామని సిఫీ డేటా సెంటర్ భూమి పూజకు వచ్చిన క్రమంలో మంత్రి లోకేష్ తెలిపారు. ఏది ఏమైనా కేంద్రం సహకారంతో విశాఖ ఆర్థిక ప్రగతికి ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది .
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications