టార్గెట్ చంద్రబాబు టీం : రంగంలోకి కేంద్ర విచారణ సంస్థలు - నోటీసులు..!!
ED Notices: ఏపీలో ఎన్నికలకు పార్టీ సిద్దం అవుతున్న వేళ..కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న అక్రమాల పైన ఇప్పుడు కేంద్ర విచారణ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. 2014-2019 సమయంలో కీలకంగా వ్యవహరించిన 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు వారు ఈడీ విచారణకు హాజరు కావాలని సూచించింది.

చంద్రబాబు హయాంలో అక్రమాలంటూ
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అక్రమాల వ్యవహారంలో ఇప్పుడు ఈడీ ముందుకొచ్చింది. స్కిల్ డెవపల్ మెంట్ కార్పోరేషన్ లో అక్రమాలు జరిగినట్లు ఈడీ ప్రాధమిక అంచనాకు వచ్చింది. ఆ సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ సంస్థ 3,350 కోట్ల ఒప్పందం చేసుకుంది. అందులో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా 370 కోట్లు. ఈ ప్రభుత్వ వాటాలోని 370 కోట్లలో సుమారు 241 కోట్ల 78 లక్షల 61 వేల 508 రూపాయలు దారి మల్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిధుల మల్లింపు విషయాన్ని నిర్ధారించారు. ఏపీ ప్రభుత్వం నుండి 370 కోట్లు బిల్లులు తీసుకున్న సిమెన్ సంస్థ జీఎస్టీని కూడా ఎగ్గొట్టింది. నకిలీ వాయిస్‌లతో ఎగనామం పెట్టడాన్ని జీఎస్టీ అధికారులు గుర్తించారు.

రంగంలోకి ఈడీ.. 26 మందికి నోటీసులు
ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో సీఐడీ విచారణ చేపట్టిన ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో సిఎ విపిన్‌కుమార్ శర్మ, అతని భార్య నీలం శర్మలను ఢిల్లీ లో అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో 234 కోట్లు స్కామ్ జరిగినట్లు దర్యాప్తులో తేల్చారు. అప్పట్లో పూణేకు చెందిన కంపెనీ ప్రతినిధులు మరోవైపు అక్రమ తప్పలను అంగీకరించారు. 2017లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ యూనిట్, పూణే, డిజైన్‌టెక్‌పై వివిధ షెల్ కంపెనీల ద్వారా నకిలీ బిల్లులను సమర్పించినందుకు కేసు నమోదు చేయడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు వ్యవహారం బయటకు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.

షెల్ కంపెనీలతో నిధుల మళ్లింపు
26 మందికి నోటీసులు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసారు. పలు షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు జరిగినట్లు తేల్చిన ఈడీ ఈ మేరకు కేసు నమోదు చేసింది. నోటీసులు పంపిన వారిలో మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఉన్నారు. వారితో పాటు ఓఎస్డీ నిమ్మగడ్డ కృష్ణప్రసాద్‌కు నోటీసులు జారీ చేశారు. ఇన్‌వెబ్ సర్వీస్ నుంచి సీమెన్స్ తో పాటు డిజైన్ టెక్ కంపెనీకి నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ పక్కా ఆధారాలు సేకరించింది. కార్పొరేషన్ మాజీ ఎండీ గంటా సుబ్బారావుకు చెందిన.. ప్రతీక్ ఇన్ఫో సర్వీసెస్‌కు కోట్ల రూపాయల మళ్లింపు జరిగినట్లు ఈడీ తేల్చింది. చంద్రబాబు ప్రభుత్వానికి జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇచ్చే విషయమై ఒప్పందం కుదిరింది. ఇక, ఇప్పుడు ఈడీ నోటీసులు..విచారణ వేళ ఈ వ్యవహారం ఎటువంటి టర్న్ తీసుకుంటుందనేది చూడాలి.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications