'ఆమె' విమానాల వివరాలపై ఈడీ దర్యాప్తు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఇప్పటికే ఈ కేసులోకేసులో అరెస్టయిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి భార్య కనికా టెక్రివాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. సుమారు అర గంటకు పైగా అనేక విషయాలపై ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించారు. 'జెట్ సెట్ గో' సంస్థ పేరుతో కనికా టెక్రివాల్ ప్రత్యేక విమానాలను నడుపుతుంటారు. అయితే, ఈ సంస్థ నడిపిన విమానాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ప్రయాణించినట్లు కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ గుర్తించింది. ఇందులో రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఉన్నారు. దీంతో ఈ సంస్థ నడిపిన విమాన సర్వీసుల వివరాలను, జెట్ సెట్ గో సంస్థ వివరాలను ఈడీ సేకరించింది. గత నెల 18వ తేదీనే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆప్ ఇండియా (ఏఏఐ) నుంచి వివరాలన్నీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

జెట్ సెట్ గో సంస్థ సంస్థ కార్యనిర్వహణ ఎలా ఉంది? నడుస్తున్న విమానాలు? సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిపిన కార్యకలాపాలు, చార్టెర్డ్ విమానాల ద్వారా ప్రయాణించిన ప్రయాణికుల వివరాలను ఏఏఐ నుంచి ఈడీ తీసుకుంది. ఈ సమాచారాన్ని క్రోడీకరించుకున్న అధికారులు వివరాలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా కనికాను విచారణకు పిలిచి ప్రశ్నించామని ఈడీ అధికారులు వెల్లడించారు. అరబిందో ఫార్మా డైరెక్టర్ అయిన శరత్ చంద్రారెడ్డి కనికా టేక్రివాల్ ను ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఈ ఛార్టెర్డ్ విమానాలద్వారానే నగదును తరలించారని ఈడీ గుర్తించింది.












Click it and Unblock the Notifications