Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ ముఖ్య నేతపై ఈడీ గురి - ఆట మొదలు..!!

ఏపీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయం..నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఎంవీవీ పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. భూ ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంవీవీతో పాటుగా ఆయన సన్నిహితుల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం పరిధిలో నమోదు చేసిన కేసులు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.

ఈడీ సోదాలు
మాజీ ఎంపీ ఎంవీవీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సత్యానారాయణ నివాసంతో పాటుగా మధురవాడలోని కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. ఎంవీవీతో పాటుగా ఆడిటర్‌ వెంకటేశ్వరరావు, గద్దె బ్రహ్మాజీ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలను నిర్వహిస్తుంది. మొత్తం ఐదు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహిస్తుంది. ఎంవీవీ సత్యనారాయణపై మోసం, కుట్ర, ఫోర్జరీ వంటి ఆరోపణలతో కేసు నమోదయింది. వీటిల్లో ఇప్పటికే ఎంవీవీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు.

ED raids former MP MVV Satyanarayana in land grabbing case

ఆడిటర్ తో సహా
ఎంవీవీకి ఆడిటర్ గా వ్యవహరిస్తున్న జీవీ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. హయగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌, కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మధురవాడ భూమి కొనుగోలు కేసులో ఈడీ సోదాలు చేస్తుందని తెలుస్తోంది. దాదాపుగా రూ.12.5 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ కేసు నమోదు అయింది. ఎంవీవీ పలు తెలుగు సినిమాలను నిర్మించారు. గీతాంజలి, అభినేత్రి, నీవెవరు వంటి సినిమాలను ఎంవీవీ నిర్మించారు. కాగా, 2006-2008 మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ కేసు నమోదు అయింది.

భూ కేసుల్లో
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బిల్డర్. ఫోర్జరీ చేసి విక్రయ పత్రాలను కూడా తయారు చేశారని ఆరోపణలున్నాయి. హయగ్రీవ కనస్ట్రక్షన్స్ విశాఖ పరిధిలో వృద్ధాశ్రమం, అనాధాశ్రమాన్ని నిర్మించడానికి 2008లో ప్రభుత్వం నుంచి 12.51 ఎకరాలను అప్పట్లో మార్కెట్ రేటుకు కొనుగోలు చేసింది. ఈ స్థలానికి సంబంధించి తరువాతి కాలంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. కాగా, 2019లో విశాఖ నుంచి ఎంవీవీ వైసీపీ ఎంపీగా గెలిచారు. తాజా ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈడీ సోదాల గురించి అధికారికంగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఏం గుర్తించారనేది వెల్లడించాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+