వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు తలుచుకుంటే: పళనిసామి సీరియస్, ప్రభుత్వం కూలిపోతోంది!పాల దెబ్బ!

నీపని నీవు చేసుకుని వెళితే బాగుంటుంది, లేదంటే మన ప్రభుత్వానికి మొదటికే మోసం వస్తోందని సీఎం పళనిసామి మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీకి హితభోద చేశారని వెలుగు చూసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రైవేట్ పాలలో రసాయనాలు కలుపుతున్నట్లుగా తమిళనాడు మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారని అన్నాడీఎంకే (అమ్మ) వర్గం

నాయకులు అంటున్నారు.

నీపని నీవు చేసుకుని వెళితే బాగుంటుంది, లేదంటే మన ప్రభుత్వానికి మొదటికే మోసం వస్తోందని సీఎం పళనిసామి మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీకి హితభోద చేశారని వెలుగు చూసింది. అధికారంలో ఉండాలంటే మనం ఎవరితో పెట్టుకుంటున్నామో ? అనే

విషయం ఆలోచించాలని ఎడప్పాడి పళనిసామి మంత్రికి క్లాస్ పీకారని తెలిసింది.

ప్రైవేట్ పాలు తెచ్చిన తంటా !

ప్రైవేట్ పాలు తెచ్చిన తంటా !

ప్రైవేట్ పాలలో రసయనాలు కలుపుతున్నారని, ఆ పాలు తమిళనాడు ప్రజలు ఉపయోగించరాదని ఆ రాష్ట్ర మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యలను ప్రైవేట్ పాల సంస్థలు ఖండించాయి.

ప్రైవేట్ పాలకు భారీ దెబ్బ !

ప్రైవేట్ పాలకు భారీ దెబ్బ !

మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యలతో ప్రైవేట్ పాల వ్యాపారం దెబ్బ తినే ప్రమాదం ఉందని పలు సంస్థల ఏజెంట్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ప్రైవేట్ పాలల్లో రసాయనాలు కలుపుతుంటే ఇంత కాలం మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని బహిరంగంగా ప్రశ్నించారు.

మామూళ్లు రాలేదా ? స్టాలిన్, క్యాప్టెన్

మామూళ్లు రాలేదా ? స్టాలిన్, క్యాప్టెన్

ప్రైవేట్ పాల కంపెనీల నుంచి మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీకి మామూళ్లు రాకపోవడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు. ప్రజల జీవితాలతో చెలగాటంఆడటానికి మంత్రి రాజేంద్ర బాలాజీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని డీఎండీకే వ్యవస్థాపకుడు, సినీ నటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ మండిపడ్డారు.

ప్రైవేట్ పాలలో రసాయనాలు, ఇదే సాక్షం !

ప్రైవేట్ పాలలో రసాయనాలు, ఇదే సాక్షం !

తమిళనాడులో సరఫరా చేస్తున్న ప్రైవేట్ పాలల్లో రసాయనాలు కలుపుతున్నారని తమ దగ్గర సాక్షాలు ఉన్నాయని మంత్రి రాజేంద్ర బాలాజీ అంటున్నారు. గిండి, మాధవరంలోని ప్రభుత్వం పరిశోధనా కేంద్రంలో సాగిన పరిశీలనలో కొన్ని రకాల మిశ్రమాలతో పార్మా డిలైట్ అన్న రసాయనాన్ని గుర్తించడం జరిగిందని మంత్రి రాజేంద్ర బాలాజీ స్పష్టం చేశారు.

మైసూరు నుంచి వస్తే ఫినిష్ !

మైసూరు నుంచి వస్తే ఫినిష్ !

మైసూరులోని కేంద్ర ప్రభుత్వ పరిశోధనా కేంద్రానికి సైతం ప్రైవేట్ పాలను పంపించామని, అక్కడి నుంచి నివేదిక రాగానే ప్రైవేట్ పాల సంస్థల భరతం పట్టే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి రాజేంద్ర బాలాజీ హెచ్చరించారు.

ఉరికి సిద్దం, ప్రైవేట్ పాల సంస్థలు ?

ఉరికి సిద్దం, ప్రైవేట్ పాల సంస్థలు ?

ప్రైవేట్ పాలలో రసాయనాలు కలిపారని తాను నిరూపిస్తానని, లేదంటే తన పదవికి రాజీనామా చేసి ఉరి కంబంలో వేలాడటానికి సిద్దంగా ఉన్నానని రాజేంద్ర బాలాజీ సవాలు చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి తాను సిద్దంగా ఉన్నాననిస్పష్టం చేశారు.

సీన్ లోకి సీఎం బాబు !

సీన్ లోకి సీఎం బాబు !

ప్రైవేట్ పాలలో రసాయనాలు కలిపి తమిళనాడులో సరఫరా చేస్తున్నారని ఆ రాష్ట్ర మంత్రి కేటీ. రాజేంద్ర బాలాజీ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. అంతే కాకుండా ఇప్పటికే 25 శాతం ప్రైవేటు పాల విక్రయాలు ఫతనం అయ్యాయని చంద్రబాబు దగ్గర ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రైవేట్ పాల సంస్థల నిర్వహకులు వాపోయారని తెలిసింది.

చంద్రబాబుకు లింక్ ఉంది ?

చంద్రబాబుకు లింక్ ఉంది ?

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం మిత్రపక్షం అనే విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు ఢిల్లీ పెద్దలతో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెందిన హెరిటేజ్ పాలు చెన్నైతో సహ తమిళనాడులో విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని సమాచారం.

'సీఎం పళనిసామి ఆగ్రహం !

'సీఎం పళనిసామి ఆగ్రహం !

ఇలాంటి సమయంలో ప్రైవేట్ పాల విషయంలో జోక్యం చేసుకుంటే మొదటికే మోసం వస్తోందని ఎడప్పాడి పళనిసామి మంత్రి రాజేంద్ర బాలాజీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు దృష్టి పెడితే పరిస్థితి వేరుగా ఉంటుందని ఎడప్పాడి పళనిసామి ఆందోళన చెందుతున్నారని సమాచారం.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కథ !

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కథ !

ప్రైవేట్ పాల విక్రయాల విషయంలో చంద్రబాబు నాయుడు దృష్టి పెడితే మనం ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉందని పళనిసామి మంత్రి రాజేంద్ర బాలాజీ దగ్గర ప్రస్తావించారని సమాచారం. చంద్రబాబు నాయుడు తన పలుకుబడి ఉపయోగిస్తే మనకు మద్దతు ఇష్తున్న 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు చెయ్యిజారి పోయే అవకాశం ఉందని, ప్రభుత్వం కుప్పకూలిపోతోందని ఎడప్పాడి పళనిసామి మంత్రి రాజేంద్ర బాలాజీకి చెప్పారని తెలిసింది. అందుకే ప్రైవేట్ పాల విషయంలో రెండు మూడు రోజుల నుంచి మంత్రి రాజేంద్ర బాలాజీ మౌనంగా ఉన్నారని అన్నాడీఎంకే (అమ్మ) వర్గం నాయకులు గుసగుసలాడుతున్నారు.

English summary
Sources said that Chief Minister of TamilNadu, Edappadi Palanisamy give warning to Minister RajendraBalaji over the Private Milk firms issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X