వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోబోట్స్‌కు చంద్రబాబు విరుగుడు: లోకేష్‌తోనే ఎందుకు ఆపావని రోజా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రోబోలకు విరుగుడు మంత్రం చెప్పారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎక్కువ మంది పిల్లలను కనండి, రోబోట్స్‌కు చంద్రబాబు విరుగుడు : లోకేష్‌తోనే ఎందుకు ఆపావని రోజా

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రోబోలకు విరుగుడు మంత్రం చెప్పారు. రోబోలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన సూచించారు

చదువుకున్న దంపతులు ఎక్కువ మంది పిల్లలను కంటే బరువు పెరుగుతుందని భావిస్తున్నారని, అందువల్ల ఎక్కువ మంది పిల్లలను కనడానికి ఇష్టపడడం లేదని ఆయన చెప్పారు.

ఇంతకు ముందు తాను కుటుంబ నియంత్రణను ప్రోత్సహంచేవాడినని, కానీ ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలను కనాలని సలహా ఇస్తున్నానని, దానివల్ల రోబోలపై మనం ఆధారపడడం తగ్గుతుందని చంద్రబాబు అన్నారు.

ఇలా భావిస్తున్నారు..

ఇలా భావిస్తున్నారు..

ఈ తరం దంపతులు తక్కువ మంది పిల్లలను కనాలని అనుకుంటున్నారని, ఎక్కువ మందికి జన్మనిస్తే బరువు పెరుగుతుందని అనుకుంటున్నారని, ఈ భావన చదువుకున్నవారిలో ఎక్కువగా ఉందని చంద్రబాబు అన్నారు.

రోజా ప్రశ్న ఇది...

రోజా ప్రశ్న ఇది...

చంద్రబాబు వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా భగ్గుమన్నారు. లోకేష్‌తోనే చంద్రబాబు పిల్లలను కనడం ఎందుకు ఆపేశాడో తొలుత సమాధానం చెప్పాలని ఆమె అడిగారు. లోకేష్ దేవాన్షు ఒక్కడితోనే ఎందుకు ఆపేశాడో కూడా చెప్పాలని ఆమె అన్నారు.

లోకేష్‌పై అసంతృప్తి..

లోకేష్‌పై అసంతృప్తి..

చంద్రబాబు వ్యాఖ్యలోని అసలు ఉద్దేశ్యమేమిటనేది అర్థం కావడం లేదని కాంగ్రెసు నేత సుంకర పద్మశ్రీ అన్నట్లు దక్కన్ క్రానికల్ రాసింది. పరిపక్వత లేని, రాజకీయాలను నడపలేని నారా లోకేష్‌పై అసంతృప్తితో ఆ వ్యాఖ్యచేసి ఉంటారని ఆమె అన్నారు.

ఎలా చేస్తారు....

ఎలా చేస్తారు....

అటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు ఎలా చేస్తారని పద్మశ్రీ ప్రశ్నిస్తూ మానవ శక్తికి నాణ్యమైన విద్యను, ఉద్యోగావకాశాలను భవిష్యత్తులో ఎలా కల్పిస్తారని అడిగారు. చంద్రబాబు నాయుడు అటువంటి వ్యాఖ్యలు చేయడానికి ముందు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించి, వారి జీవితాలు బాగుపడే పరిస్థితులు కల్పించాలని ఆమె అన్నారు.

English summary
AP Chief Minister N. Chandrababu Naidu on Monday stirred a hornet’s nest, saying that people should have more children to reduce dependency on robots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X