ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్- ఫీజులు, ఈ సారి కొత్తగా..!!

ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. ఇప్పటికే పరీక్షా ఫీజు వివరాలు.. తేదీలను ప్రకటించింది. కాగా, ఈ సారి పదో తరగతి పరీక్ష రాసే విద్యార్ధుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాల ఏర్పాటు. .అక్కడ పరీక్షకు వెళ్లే విద్యార్ధులకు ఎక్కడా అసౌకర్యం లేకుండా కొత్త విధానం అమల్లోకి తెస్తున్నారు. ప్రతి జిల్లాలో పది ఫలితాల్లో వెనుకబడిన 100 పాఠశాలలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. పదో తరగతి పరీక్షలు రాసే అభ్యర్థులందరికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ ఉండాలని స్పష్టం చేసింది.

ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది కొత్తగా హాల్‌టికెట్ల వెనుక భాగంలో పరీక్ష కేంద్రం రూట్‌ మ్యాప్‌ను ముద్రించనున్నారు. అందులోని క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్‌ వస్తుంది. దీని ద్వారా విద్యార్ధులు తాము వెళ్లాల్సి న పరీక్షా కేంద్రాల వివరాలు... చిరునామా గురించి ఎలాంటి సందేహాలు లేకుండా ఈ విధానం అమల్లోకి తెస్తున్నారు. అదే సమయంలో పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే చీఫ్‌ సూపరింటెం డెంట్, ఇన్విజిలేటర్లను ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

education-officials-finalised-the-schedule-for-ssc-exams-govt-to-take-final-decision

కాగా, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూలును విడుదల చేశారు. రెగ్యులర్‌ విద్యార్థులు, ఒకసారి ఫెయిల్‌ అయిన విద్యార్థులు, ఒకేషనల్‌ విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 13 నుంచి 25 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 3 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 10 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 15 వరకూ పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. విద్యార్ధులు చెల్లించిన ఫీజును అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ప్రిన్సిపల్స్‌ పాఠశాల లాగిన్‌ ద్వారా చెల్లించాలని సూచించారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించింది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల వెసులు బాటు కోసం ముందుగానే పరీక్షలు పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో, పదో తరగతి పరీక్షలను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+