రైలు నుండి దూకడంతో మరో రైలు ఢీకొని 8మంది మృతి
విజయనగరం: విజయనగరం జిల్లాలో శనివారం ఘోరం జరిగింది. జిల్లాలోని గొట్లాం వద్ద అలెప్పి - ధనబాద్ ఎక్స్‌ప్రెస్‌లోని ఎసి కోచ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఎస్ 1 బోగీలో ఉన్న ప్రయాణీకులు కిందకు దూకేసి పక్క ట్రాక్ పైన నిలబడ్డారు. అదే సమయంలో పక్క ట్రాక్ పైన వస్తున్న విజయవాడ ప్యాసింజర్ రైలు వీళ్ల మీద నుండి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. గొట్లాం రైల్వే స్టేషన్ వద్ద శనివారం రాత్రి ఈ ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఎసి కోచ్‌లో మంటలు వచ్చాయని తెలియడంతో ప్రయాణికులు ఆందోళనతో రైలును ఆపి కిందికి దిగి పరుగులు తీయడం మొదలు పెట్లారు. కోందరు మాత్రం పక్కనే ఉన్న ట్రాక్‌పై నిలబడ్డారు.

వారిని ఆ ట్రాక్‌పై వస్తున్న విజయవాడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో మృతి చెందారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్బాృంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తోనూ మాట్లాడి వెంటానే సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను విజయనగరం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications