రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్: టీడీపీ అభ్యర్దులుగా వీరే - బీజేపీ - జనసేన నుంచి ఆ ఇద్దరూ ..!!

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఏపీ తో సహా దేశ వ్యాప్తంగా 24 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1 నోటిఫికేషన్.. వచ్చే నెల 18న అవసరమైన రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఏపీ, కర్ణాటక, గుజరాత్ నుంచి నాలుగు స్థానాల మేర ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే ఈ స్థానాల్లో పోటీ.. అభ్యర్ధుల పైన కూటమి నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. మూడు పార్టీలు తమ అభ్యర్ధుల విషయంలో దాదాపు నిర్ణయానికి వచ్చేసారు. బీజేపీ.. జనసేన నుంచి అభ్యర్ధుల పై అనూహ్య ఎంపిక జరగనుంది.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దీంతో.. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీతో పాటు సానా సతీష్ పదవీ కాలం వచ్చే నెలతో ముగుస్తోంది. కూటమిలోని మూడు పార్టీలు ఈ నాలుగు సీట్ల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టీడీపీకి రెండు, జనసేన - బీజేపీకి చెరో సీటు కేటాయించ నున్నారు. ఇప్పటికే ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. టీడీపీ - జనసేన నుంచి దక్కే మూడు స్థానాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. అందులో భాగంగా సిట్టింగ్ ఎంపీ సానా సతీశ్ కు రెన్యువల్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ.. ఎస్సీ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే తన పేరు పరిశీలించాలని సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేరు వినిపిస్తోంది.

టీడీపీకి మరో గవర్నర్ పదవి - ఆయనకే దక్కేది..!?
టీడీపీకి మరో గవర్నర్ పదవి - ఆయనకే దక్కేది..!?
election-commission-announced-the-schedule-for-the-upcoming-biennial-elections-to-the-rajya-sabha-to

కూటమి అభ్యర్దులుగా వీరికే అవకాశం

అయితే.. ఈ సారి అనూహ్యంగా ముస్లి మైనార్టీ వర్గం కు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగు తోంది. ఈ కోటాలో ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఎంఏ. షరీఫ్ కు దక్కే అవకాశం ఉంది. బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కు ఖాయం అవుతుందని చెబుతున్నారు. జనసేన నుంచి ఇప్పటి వరకు లింగమేనని రమేశ్ పేరు వినిపించినా.. ఇప్పుడు అనూహ్యంగా పారిశ్రామిక వేత్త బండారు నరసింహరావు, టాలీవుడ్ లో వరసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రముఖ నిర్మాత కూడా ఒకరు రేసులోకి వచ్చారు. ఇక.. బీజేపీ నుంచి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నామలై విషయంలో కూటమి నేతలకు బీజేపీ నేతలు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. చివరి నిమిషం లో అనూహ్య మార్పులు జరిగితే మినహా ఈ పేర్లలోనే రాజ్యసభకు తుది ఎంపిక ఉండే అవకాశం ఉంది. కాగా, ఇప్పుడు షెడ్యూల్ విడుదల కావటంతో మూడు పార్టీల నేతలు వచ్చే వారం సమావేశం కానున్నారు. అధికారికంగా తమ అభ్యర్ధులను ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+