వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై ఆ మచ్చ: సీరియస్‌గా తీసుకున్న పీకే, ఇదీ గ్రౌండ్ రియాలిటీ?

జగన్ నాయకత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్న ఓ ప్రచారాన్ని కూడా ప్రశాంత్ కిశోర్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రత్యర్థిని పడగొట్టాలంటే.. ముందు వారి బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకోగల నేర్పు రాజకీయ పార్టీలకు ఉండాలి. ఒక అవకాశం ఇచ్చి చూస్తే ఎలా ఉంటుందో.. అన్న అభిప్రాయం జనంలో నాటుకునేలా చేయగలిగాలి. అలా అయితేనే అధికార పార్టీ పునాదులు కదిలించడానికి ఒక మార్గం అంటూ ఏర్పడుతుంది.

'ప్రశాంత్ కిషోర్ టిడిపి గెలుస్తుందంటే, కేసీఆర్ జగన్ గెలుస్తాడని చెప్పడమా''ప్రశాంత్ కిషోర్ టిడిపి గెలుస్తుందంటే, కేసీఆర్ జగన్ గెలుస్తాడని చెప్పడమా'

కానీ ఏపీ ప్రతిపక్షం చాలాచోట్ల ఈ అవకాశాలను చేజార్చుకుంది. అధికార పార్టీని ఇరుకునపెట్టాల్సింది పోయి తానే ఇరుకునపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాల్ మనీ, బాక్సైట్ తవ్వకాలు, ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, ప్రత్యేక హోదాను నీరుగార్చడం.. ఇవన్ని టీడీపీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవే అయినా.. వాటిని జనంలోకి తీసుకెళ్లగలగడంలో వైసీపీ విఫలమైంది.

కనీసం క్యాష్ చేసుకోలేక:

కనీసం క్యాష్ చేసుకోలేక:

అనుకూలంగా మలుచుకోవడం సంగతి పక్కనపెడితే.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కనీసమాత్రంగానైనా క్యాష్ చేసుకోలేకపోయింది. 2019ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. మొత్తం మీద ఆ పార్టీలో ఒక అంతర్మథనం మొదలైంది. ఎక్కడో తప్పు జరుగుతున్న మాట వాస్తవమే అని గుర్తించారు. లోటుపాట్లను సరిగా అంచనా వేయడానికి ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్తను రంగంలోకి దించారు.

Recommended Video

Ysrcp Sitting MLA's Anxity For Tickets In 2019 Elections | Oneindia Kannada
ఎక్కడ వెనకబడ్డాం?:

ఎక్కడ వెనకబడ్డాం?:

క్షేత్ర స్థాయిలో తన టీమ్‌తో రంగంలోకి దిగిన పీకే.. అప్పుడే తన పని మొదలుపెట్టేశారు. వైసీపీ ఎక్కడ వెనకబడింది.. టీడీపీ ఏ అంశాల్లో మెరుగ్గా ఉంది వంటి అంశాలపై ఆయన ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ఆయన గుర్తించిందేంటంటే.. టీడీపీ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఆ అంశాలపై వైసీపీ అంతగా ఫోకస్ చేయడం లేదు.

జగన్‌పై మచ్చ.. పీకే సీరియస్:

జగన్‌పై మచ్చ.. పీకే సీరియస్:

అంతేకాదు! జగన్ నాయకత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్న ఓ ప్రచారాన్ని కూడా ప్రశాంత్ కిశోర్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ ఎవరి మాట వినే రకం కాదని. కనీసం పార్టీ వ్యక్తుల అభిప్రాయాలకైనా విలువ ఇవ్వాలని, ఏకపక్ష పోకడలను పక్కనబెట్టాలని పలువురు అభిప్రాయడినట్లు పీకే దృష్టికి వచ్చిందట. దీంతో ఈ అంశంపై పీకే గట్టిగానే ఫోకస్ చేసినట్లు సమాచారం.

మరి ఎవరి మాట వినని జగన్.. పీకే మాట అయినా వింటారా? అని ప్రత్యర్థి వర్గం సైతం ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా టీడీపీ బలం కన్నా.. వైసీపీ బలహీనతలే ప్రజల్లో ఎక్కువగా నాటుకుపోయాయని పీకే గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టి.. వైసీపీ పట్ల పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేయాలంటే.. పీకేకు ఆ పార్టీ కూడా సహకరించాల్సి ఉంటుంది.

పీకేకు సహకరిస్తారా?

పీకేకు సహకరిస్తారా?

పీకే గుర్తించిన లోపాలను సవరించుకోవడానికి జగన్&కో సుముఖంగా ఉంటేనే.. కనీసం ఇప్పటినుంచైనా ఆయన నాయకత్వం పట్ల ప్రజల్లో ఒక విశ్వాసం ఏర్పడుతోంది. అలా కాదని మొండికిపోతే.. భవిష్యత్తుపై నమ్మకం పెట్టుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో జగన్ పీకే సూచనలను ఎంతమేర పాటిస్తారు?.. అసలు వైసీపీ బలహీనతలను తొలగించడానికి పీకే ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారన్నది ఆసక్తికరం. రాబోయే రోజుల్లో వీటికి సమాధానం దొరకవచ్చు.

English summary
Election strategist Prashant Kishor seriously focused on weakness of YSRCP party. He making some plans to strengthen Jagan's leadership qualities
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X