Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ.. చంద్రబాబు మూడురోజుల కుప్పం పర్యటన; బహిరంగ సభలతో బిజీబిజీగా!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో చంద్రబాబు మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. నేడు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరుకు చేరుకొని, అక్కడ తెలుగుదేశం పార్టీ ఫోరం నేతలతో సమావేశం అవుతారు చంద్రబాబు. అనంతరం రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు చేరుకుంటారు.

అక్కడ నుండి చంద్రబాబు షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఈరోజు సాయంత్రం చిత్తూరు జిల్లాలోని గుడుపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం ఆరు గంటలకు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ వర్గాలతో చంద్రబాబు సమావేశం అవుతారు.

Election time.. Chandrababu three-day visit to Kuppam; Busy with public meetings!!

రాత్రి ఎనిమిది గంటలకు మనోహర్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. ఆపై రాత్రి 8 గంటల 45 నిమిషాలకు కుప్పంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో రాత్రి బస చేస్తారు. 29వ తేదీ చంద్రబాబు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు.

సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు కుప్పంలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. 6 గంటల 15 నిమిషాలకు బీసీఎన్ కన్వెన్షన్ హాల్లో టిడిపి నేతలతో సమావేశం అవుతారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మళ్ళీ రాత్రి బస చేస్తారు.

Election time.. Chandrababu three-day visit to Kuppam; Busy with public meetings!!

ఇక 30వ తేదీన చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు పీఈఎస్ సమీపంలోని కురుబ భవన్ వద్ద భక్త కనకదాసు విగ్రహావిష్కరణ, బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు కుప్పం పట్టణంలోని అన్న క్యాంటీన్ సందర్శన చేస్తారు.

పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు పూజలు చేస్తారు. 3 గంటల 30 నిమిషాలకు కుప్పం మసీదులో ప్రార్థనలు, ముస్లిం మైనారిటీలతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కుప్పం మండలం మల్లానూరు ఆర్టిసి బస్టాండ్లో బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభలతో బిజీబిజీగా చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+