తిరుమలలో ఘోరం: విద్యుత్ షాక్‌తో తల్లీబిడ్డ మృతి

Electric shock: Son and Mother died in Tirumala
చిత్తూరు: తిరుమలలో సోమవారం రాత్రి ఘోరం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆలయంలోకి వెళ్లేందుకు క్యూలైన్లో వస్తుండగా విద్యుదాఘాతానికి గురై తిరువళ్లూరుకు చెందిన తల్లీ, బిడ్డ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి ట్రావెలర్స్ బంగా కాటేజీ వద్ద ఉన్న క్యూలైన్లో చోటుచేసుకుంది. తిరువళ్లూరుకు చెందిన లక్ష్మి, తన ఏడాది బిడ్డ మహేష్, భర్త, ఇతర 10 మంది కుటుంబసభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం సోమవారం తిరుమలకు చేరుకున్నారు.

ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అందులో లక్ష్మి, ఆమె భర్త, తనయుడు మహేష్ (1), కొంతమంది కుటుంబసభ్యులు తలనీలాలు కూడా సమర్పించారు. ఉచిత క్యూలైన్ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లారు. టిబిసి, ఎంబిసి కూడలి వద్ద ఉన్న క్యూలైన్లోకి ప్రవేశించారు.

ఈ నేపథ్యంలో లక్ష్మి కుటుంబసభ్యులంతా ముందు వెళుతుండగా వారి వెనుక తన తల్లి చేయిపట్టుకుని వస్తున్న మహేష్ పక్కనే ఉన్న ఇనప కంచెను తాకాడు. అప్పటికే విద్యుత్ వైర్లు ఆ కంచెకు తగిలి విద్యుత్ సరఫరా అవుతుండటంతో తల్లీబిడ్డ విద్యుదాఘాతానికి గురయ్యారు.

విద్యుదాఘాతానికి గురైన లక్ష్మి గట్టిగా కేకలు వేయడంతో క్యూలైన్లోని భక్తులు, ఆమె భర్త, కుటుంబసభ్యులు కూడా హడలిపోయారు. అయితే అప్పటికే వారు కిందపడిపోయారు. వెంటనే వారిని అంబులెన్స్‌లో అశ్విని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తల్లి, కొడుకు ఇద్దరు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే టిటిడి సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గత మూడు రోజులుగా తిరుమలలో భారీగా కురుస్తున్న వర్షం కారణంగా భూమిలోని విద్యుత్ వైర్లు పైకి వచ్చి ఉంటాయని టిటిడి అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+