Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Srisailam:ప్రకృతి ప్రేమికులకు కేంద్రం వరం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపిస్తుంది. హైవే 756లో హైదరాబాద్ శ్రీశైలం మధ్య ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని, రానున్నకాలంలో పెరిగే ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని జాతీయ రహదారి విస్తరణ చేపడుతోంది కేంద్రం. ఈ క్రమంలోనే వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో శ్రీశైలం నల్లమల అటవీప్రాంతంలో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని మిగతా చోట భూమి పైనే రోడ్డు విస్తరిస్తామని కేంద్రం వెల్లడించింది.

మల్లన్న మార్గంలో ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణం
ఇక ఇదే సమయంలో ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టు నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వు మీదుగా వెళుతున్న నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో ఇటీవల సమావేశాన్ని నిర్వహించి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పైన వారికి వివరించారు.

Elevated Corridor in Srisailam nallamala forest area Center gave a boon for nature lovers

30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ కారిడార్
మొత్తం 30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేస్తామని, 45.42 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ వస్తుందని వారు రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఇక నల్లమల అటవీ ప్రాంతంలోనూ, అమ్రాబాద్ టైగర్ రిజర్వులోనూ ఈ రోడ్డు విస్తరణకు అటవీ భూమి కావాలని కేంద్ర అధికారులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.

కేంద్ర అధికారులకు రాష్ట్ర అటవీ అధికారుల సూచనలు
ఇక కేంద్రం యొక్క ప్రతిపాదన విన్న రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నల్లమల అటవీ ప్రాంతంలోనూ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఎక్కువ చెట్లు నరకకుండా అటవీ విధ్వంసం సృష్టించకుండా రోడ్డు విస్తరణ ప్రణాళికలో మార్పులు చేర్పులు సూచించారు. ఇక రోడ్డుని విస్తరించాక ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వాహనాలు 24 గంటలు రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పడంతో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఉండాలన్నారు.

నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ మార్గదర్శకాల ప్రకారం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
లైటింగ్ కూడా అదే విధంగా ఉండాలని, ఫ్లై ఓవర్ మార్గమధ్యంలో వాహనాలు ఎక్కి దిగేలా ర్యాంపులు నిర్మించకూడదని, అటవీ శాఖ అధికారులు కేంద్ర అధికారులకు తెలిపారు. నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ మార్గదర్శకాల ప్రకారం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పైన ముందుకు వెళ్లాలని వారి కేంద్ర అధికారులతో మాట్లాడారనీ సమాచారం.

ఎలివేటేడ్ కారిడార్ పై మాజీ సీజేఐ ఎన్వీ రమణ ప్రధానికి లేఖ
ఇదిలా ఉంటే గతంలో మహాశివరాత్రి పర్వదినం సమయంలో కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరిపితే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ లేఖ రాశారు. ప్రధాని చొరవ చూపితే దక్షిణ కాశీ ప్రాజెక్టు సహకారం అవుతుందని ఆయన ఆ లేఖలో ప్రతిపాదించారు.

ఆశలు తీరేలా ప్రకృతి ఒడిలో, 30 అడుగుల ఎత్తులో ఎలివేటేడ్ కారిడార్
ఆ తర్వాత ఆ లేఖకు స్పందనగా ఎలివేటెడ్ కారిడార్ పైన కేంద్ర రహదారుల రవాణా శాఖ కార్యదర్శి నుండి తనకు సమాధానం వచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక మొత్తంగా ఎంతో కాలంగా ఎలివేటెడ్ కారిడార్ పైన ఆశలు పెట్టుకున్న వారి ఆశలను నెరవేర్చేలా ప్రకృతి ఒడిలో విహరిస్తూ 30 అడుగుల ఎత్తులో అటవీ మార్గంలో మనసు దోచే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం త్వరలో జరగబోతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+