ట్రంప్ కు ఎలాన్ మస్క్ ఫైనల్ వార్నింగ్..! కొత్త పార్టీ రెడీ- పేరు ఇదే..!
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న పన్ను, వ్యయాల బిల్లు తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఈ బిల్లుపై ఇప్పటికే విపక్షాలు దుమ్మెత్తి పోస్తుండగా.. నిన్న మొన్నటివరకూ ట్రంప్ కోటరీలో ఉంటూ తాజాగా బయటికొచ్చేసిన బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా వీరితో స్వరం కలిపారు. దీంతో ట్రంప్ బిగ్ బ్యూటిపుల్ బిల్లుగా చెప్పుకుంటున్న దీన్ని రుణ బానిసత్వ బిల్లుగా మస్క్ అభివర్ణించారు. తాజాగా ట్రంప్ తో తనకు ఏమీ గొడవలు లేవంటూ చెప్పుకొచ్చిన మస్క్ ఉన్నట్లుండి బిగ్ షాక్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన పన్ను, వ్యయ బిల్లును టెక్ దిగ్గజం ఎలోన్ మస్క్ తీవ్రంగా తప్పుబట్టారు. దీన్ని సెనేట్ ఆమోదిస్తే అమెరికా పార్టీ అనే కొత్త రాజకీయ సంస్థను ప్రారంభిస్తామని మస్క్ ప్రకటించారు. తుది ఓటింగ్‌కు ముందు నిన్న సెనేట్ ఈ బిల్లుపై చర్చించిన సందర్భంగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ బిల్లుపై ముందునుంచీ వ్యతిరేకంగా ఉన్న మస్క్.. ట్రంప్ కు దూరం కావడానికి గల కారణాల్లో దీన్ని కూడా ఒకటిగా భావిస్తున్నారు.

ట్రంప్ ఈ బిల్లు ఆమోదంతో అమెరికాకు భారీ ఎత్తున అప్పు చేయాలని చూస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాకు ఇప్పటికే ఉన్న అప్పుకు మరో 3 బిలియన్ డాలర్ల భారం వచ్చి చేరుతుందని మస్క్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదాస్పద బిల్లు ఆమోదం పొందితే తాను అమెరికా పార్టీ పెట్టడం ఖాయమని చెప్పేస్తున్నారు. అయితే ఇప్పటికే విపక్షాలకు ఆర్ధిక సాయం అందిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రంప్ చేసిన హెచ్చరికల్ని మస్క్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మస్క్ నేరుగా కొత్త పార్టీ పెడితే ఆ ప్రభావం కచ్చితంగా ట్రంప్ పై పడటం ఖాయంగా కనిపిస్తోంది.
VOX POPULI
— Elon Musk (@elonmusk) July 1, 2025
VOX DEI
80% voted for a new party https://t.co/JkeOlG7Kl4
రుణ పరిమితిని రికార్డు స్థాయిలో ఐదు ట్రిలియన్ డాలర్లకు పెంచే ఈ బిల్లు యొక్క పిచ్చి ఖర్చుతో మనం ఒకే పార్టీ దేశంలో నివసిస్తున్నామని స్పష్టంగా తెలుస్తుందని మస్క్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. పోర్కీ పిగ్ పార్టీ!! ప్రజల గురించి నిజంగా శ్రద్ధ వహించే కొత్త రాజకీయ పార్టీకి సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు జూలై 4న పెట్టుకున్న గడువుకు ముందే బిల్లును ఆమోదించడానికి సెనేట్ కృషి చేస్తోంది. గత నెలలో ఈ బిల్ దాదాపుగా ఆమోదించింది. సెనేట్ దాని వెర్షన్‌ను ఖరారు చేసిన తర్వాత, దానిని చట్టంగా సంతకం చేయడానికి ముందు సభ సూచించిన మార్పులను ఆమోదించాలి.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications