టీడీపీ ఎంపీ తల్లి డిజిటల్ అరెస్ట్..! 1.7 కోట్లు కొట్టేశారు..!
ఏపీలో ఓ టీడీపీ ఎంపీ తల్లి, మరో టీడీపీ ఎమ్మెల్యే భార్యనే సైబర్ నేరస్తులు టార్గెట్ చేసుకున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఆమె నుంచి ఏకంగా 1.7 కోట్లు కొట్టేశారు. ఈ విషయాన్ని సదరు టీడీపీ ఎమ్మెల్యే ఇవాళ వెల్లడించారు. ఐబొమ్మ పేరుతో జరుగుతున్న సినీ పైరసీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించిన నేపథ్యంలో సినీ హీరో నాగార్జున తన కుటుంబ సభ్యుల్ని కూడా రెండు రోజుల పాటు డిజిటల్ అరెస్టు చేశారని ఇవాళ వెల్లడించారు. అదే సమయంలో ఈ మోసం బయటకి వచ్చింది.
దేశంలో ఇప్పటికే పలు చోట్ల సాధారణ ప్రజల నుంచి వీఐపీల వరకూ ఫోన్ చేసి మీరు డిజిటల్ అరెస్టు అయ్యారంటూ సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని అడ్డుకోవడానికి పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఇదే క్రమంలో ఏపీలో మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్య, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తల్లిని కూడా ఇలాగే సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో నిండా ముంచినట్లు తెలుస్తోంది.

పుట్టా సుధాకర్ యాదవ్ భార్యకు సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి ఏకంగా రూ.1.7 కోట్లు కొట్టేశారని స్వయంగా ఆయనే వెల్లడించారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఢిల్లీ ఐడీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో బ్యాంక్ సిబ్బంది సాయంతోనే డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరస్తులు చెలరేగిపోతున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications