Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు -పోస్టల్ బ్యాలెట్‌తో కౌంటింగ్ షురూ -ఇప్పటికే 3 సీట్లు వైసీపీ ఖాతాలో

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకుగానీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలకు రంగం సిద్దమైంది. వివాదాలను ముగిస్తూ, కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపును ఆదివారం చేపట్టింది. నగరంలోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ను అధికారులు ప్రారంభించారు.

Eluru Municipal Corporation Election Results: counting begins, jagans ysrcp took lead

కౌంటింగ్ ప్రాంగణంలో నాలుగు హాల్స్‌లో 47 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఒకొక్క టేబుల్‌లో ఒక్కొ డివిజన్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. లెక్కింపు కోసం 64 మంది సూపర్‌ వైజర్లను, కౌంటింగ్‌ అసిస్టెంట్లను 250 మందిని ఏర్పాటు చేశారు. వీరు కాకుండా 500 మంది మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలో కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నామని అధికారులు చెప్పారు.

Eluru Municipal Corporation Election Results: counting begins, jagans ysrcp took lead

కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ ప్రారంభం అయిన దగ్గర నుంచి విజేతలను ప్రకటించే వరకు వీడియో కెమెరా ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నానికి కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. తొలుత 50 పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను కౌంటింగ్ సిబ్బంది లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్లింపు అనంతరం డివిజన్ల వారీగా ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్‌కి ప్రతీ రౌండ్‌లో1000 ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్‌కి 25 ఓట్లని బండిల్‌గా కట్టి 40 బండిల్స్‌గా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. కాగా,

Eluru Municipal Corporation Election Results: counting begins, jagans ysrcp took lead

ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉండగా, ఇప్పటికే మూడు డివిజన్లను జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా, నాలుగు నెలలు ఆలస్యంగా కౌంటింగ్ జరుగుతున్నది. ఏపీలో 75 మున్సిపాలిటీలకుగానీ తాడిపత్రి తప్ప 74 చోట్ల వైసీపీ గెలవడం, 12 మున్సిపల్ కార్పొరేషన్లకుగానూ 11 కార్పొరేషన్లు జగన్ పార్టీ చేజిక్కించుకోవడం తెలిసిందే. ఏలూరులోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనాలున్నాయి..

Recommended Video

    AP Municipal Elections: Minister Alla Nani's Vote Goes Missing In Eluru

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+