అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో పెట్టినా బుద్ధి రాదా .. ఏలూరు వింత వ్యాధిపై బాబు వ్యాఖ్యలకు కొడాలి నానీ కౌంటర్

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో రేపు కేంద్ర వైద్య బృందాలు ఏలూరు ను సందర్శించనున్నాయి. అంతుచిక్కని వింత వ్యాధి గల కారణాలను తెలుసుకోవడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి వైద్య బృందం మంగళవారం ఏలూరుకు రానుంది. ఇక ఈ సమయంలోకూడా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శలు , ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.

 టీడీపీ ప్రతి విషయాన్ని వివాదం చేస్తుందని కొడాలి నానీ ఫైర్

టీడీపీ ప్రతి విషయాన్ని వివాదం చేస్తుందని కొడాలి నానీ ఫైర్

ఏలూరులో ప్రజల అస్వస్థత పై మాట్లాడిన చంద్రబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ వేశారు.కృష్ణా జిల్లాలో ఇవాళ డి ఎస్ సి సమావేశం లో పాల్గొన్న కొడాలి నాని ప్రతి విషయాన్ని రాజకీయ పార్టీలు వివాదం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏలూరులో ప్రజల అస్వస్థత పై దృష్టి పెట్టిన ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్న కొడాలి నాని సాక్షాత్తు సీఎం జగన్ బాధితులను పరామర్శించారని పేర్కొన్నారు . సత్వర వైద్యం చెయ్యాలని అధికారులను ఆదేశించారని చెప్పారు .

 టీడీపీకి శని చంద్రబాబు, గ్రేటర్ వాసులు అందుకే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో పెట్టారు

టీడీపీకి శని చంద్రబాబు, గ్రేటర్ వాసులు అందుకే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో పెట్టారు

ఏలూరు ఘటనపై టీడీపీ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. టిడిపికి పట్టిన శని చంద్రబాబు నాయుడని పేర్కొన్న కొడాలి నాని, గ్రేటర్ హైదరాబాద్ వాసులు అందుకే చంద్రబాబు నాయుడిని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో పెట్టారని నిప్పులు చెరిగారు. ప్రజలను అభద్రతకు గురిచేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, కావాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఏలూరు నగరాన్ని అంతుచిక్కని వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే పెళ్ళికి వెళుతూ ఆసుపత్రికి వచ్చి ఒకసారి చూసి వెళ్లారు అంటూ ప్రజారోగ్యంపై ఏ మాత్రం సీఎం జగన్ దృష్టి లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు.

ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారని చంద్రబాబు ఫైర్.. నానీ రివర్స్ కౌంటర్

ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారని చంద్రబాబు ఫైర్.. నానీ రివర్స్ కౌంటర్

అంతేకాదు ప్రభుత్వ చేతగానితనం వల్ల ప్రజల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి టిడిపి విమర్శలు చేయడం తప్ప ప్రభుత్వానికి ఇంకేమీ తెలియడం లేదని , బాధ్యతగా ప్రవర్తించాల్సిన సీఎం ఇంక బాధ్యత లేనట్టు ప్రవర్తించటం దారుణమని మండిపడ్డారు. బాధితులకు అసలేం జరిగిందో పరిశీలించాలని ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టి పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్తారా అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బాబు వ్యాఖ్యలపై కొడాలి నానీ అసహనం వ్యక్తం చెయ్యటమే కాకుండా చంద్రబాబు శని అంటూ తీవ్రంగా మండి పడ్డారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+