చంద్రబాబు అధ్యక్షతన ఎల్లుండి అత్యవసర కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎల్లుండి అంటే జులై 25న కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ఇటీవలే మంత్రివర్గ సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, ఉచిత ఇసుక విధానం, అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిన దృష్ట్యా పనితీరుపైనా కేబినెట్‌లో సమీక్షించారు. అలాగే టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలపైనా కేబినెట్ చర్చించింది. అదేవిధంగా జులై 22 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Emergency cabinet meeting chaired by Chandrababu on July 25

ఇది ఇలావుంటే, మంగళవారం పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై సీఎం చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాము పెట్టిన ప్రతిపాదనలు చాలా వరకూ ఆమోదించారని ఆయన తెలిపారు.

రాజధాని నిర్మాణానికి పెద్దమొత్తంలో నిధులు ఇవ్వడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, దీని వల్ల రాష్ట్రానికి పన్నుల రూపేణా ఆదాయం పెరుగుతుందని వివరించారు. నిధులు ఏ రూపేణా వచ్చినా, అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంతో కూరుకుపోయి ఉందన్న చంద్రబాబు, అందుకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించారు.

ఏపీ రాజధాని నిర్మాణం బండి వేగం పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపకరిస్తాయన్నారు. వివిధ ఏజన్సీల ద్వారా వచ్చే నిధులు కొన్ని అప్పు రూపేణా అయినా, దాదాపు 30ఏళ్ల తర్వాతే తీర్చేదన్న సీఎం.. అది అప్పటికి అంత భారమేమీ కాదని అన్నారు. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం తన పూచీకత్తుతో ఇస్తుందనీ, మరికొంత గ్రాంట్ కూడా కలిసి ఉంటుందని తెలిపారు.

వచ్చే నిధుల్లో కొంత కేంద్ర గ్రాంట్ కూడా కాపిటల్ అసిస్టేన్స్ రూపేణా కలుస్తుందన్న ముఖ్యమంత్రి అది లాభమేనన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుకు ఇంత మేర నిధులు అని పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం చెప్పటం మనకి చాలు కదా అని వ్యాఖ్యానించారు. వెనకబడిన జిల్లాలకు ఇచ్చే సాయం బుందేల్ ఖండ్ ప్యాకేజీ తరహాలో ఉంటుందని తమకు సమాచారముందని, ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు సీఎం చంద్రబాబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+