జీపీఎఫ్ సొమ్మునూ వాడేసుకున్నారు - జగన్ ను గెలిపించుకుంటే..ఇలా చేస్తారా : ఉద్యోగ సంఘ నేతల ఎటాక్..!!
ఏపీలోని ఉద్యోగులు కావాలని కోరుకొని మరీ ముఖ్యమంత్రిగా జగన్ ను గెలిపించుకున్నా..ఆయన మాత్రం తమ సమస్యలను పట్టించుకోవటం లేదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు కూడా పక్కదారి పడుతున్నాయని సూర్యనారాయణ ఆరోపించారు. ఏపీజీఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగుల జీతం నుంచి దాచుకున్న సొమ్ము జీపీఎఫ్ ఖాతాల్లో ఉంటుందని, ఈ సొమ్మును అవసరానికి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉద్యోగులకు ఉందని తెలిపారు.

జీపీఎఫ్ సైతం వాడేసుకున్నారు
ఇది సాలీనా రూ.8-10 కోట్ల సొమ్ము ఉంటుందని, దీనిని ఎక్కడైనా మదుపు చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఆఖరికి ఈ హక్కును కూడా ప్రభుత్వం హరించి, జీపీఎఫ్ ను ఆదాయంగా మలుచుకుంటోందని ఆరోపించారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం జీపీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని ఆరోపించారు. ఎప్పుడో ఒకప్పుడు జీతాలు ఇస్తున్నాం కదా' అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉద్యోగులను కించపరడమేనని, ఆ వ్యాఖ్యల పైన అభ్యంతరం వ్యక్తం చేసారు.

జగన్ ను గెలిపించినా..పట్టించుకోవటం లేదు
ఉద్యోగుల సీపీఎస్ రద్దుతో పాటు, డీఏల చెల్లింపు, పీఆర్‌సీ అమలు, సాయంత్రం ఐదు తర్వాత పని చేయనక్కర లేదన్న ఎన్నో హామీలను జగన్ ఇచ్చారని, రెండున్నరేళ్ల పరిపాలనను పరిశీలిస్తే ఒక్కహామీ కూడా నెరవేరలేదని అన్నారు. పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులను కొన్ని సంఘాలు మభ్య పెడుతున్నాయని ఆరోపించారు. వేతన సవరణ సంఘం ఇచ్చిన నివేదికను తమకు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా తాము కొనసాగలేమని తేల్చి చెప్పారు. ఉద్యోగుల జీతాల విషయంలో మంత్రి బుగ్గన చేస్తున్న వ్యాఖ్యలు, ప్రకటనలు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉంటున్నాయని సూర్యనారాయణ అన్నారు. హైకోర్టులో కూడా ఇదే విధంగా ప్రభుత్వం కౌంటర్ వేసిందని తెలిపారు.

కడప రెడ్డికి ఆ పదవి ఎలా ఇస్తారు
ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీనే చెల్లించేలా ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అక్టోబరు 28వ తేదీన ఉద్యోగుల ఖాతాల నుంచి జీపీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసినట్టు అకౌంటెంట్ జనరల్ నుంచి మెసేజ్‌లు వచ్చాయన్నారు. ఈ పరిణామాలు చూస్తే ఉద్యోగుల సొమ్ముకు భద్రత ఉందా అనే అనుమానం వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారునిగా ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, 'కడప రెడ్డి' ఎన్. చంద్రశేఖరరెడ్డిని నియమించిన తీరు ను సూర్యనారాయణ తప్పు బట్టారు.
Recommended Video

నేడు ఉద్యోగ సంఘాల కార్యాచరణ
ఉమ్మడి ఏపీ లో హైదరాబాద్‌లోని 182 ఎకరాల ఉద్యోగుల భూములను చంద్రశేఖరరెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి ఆయన పై క్రిమినల్ కేసు పెట్టిందని, హైకోర్టు ఇచ్చిన షరతులతో కూడిన బెయిల్‌పై బయట తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రశేఖరరెడ్డిపై ప్రభుత్వమే కేసు పెట్టిందని, అదే ప్రభుత్వం ఉద్యోగుల సలహాదారునిగా ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి ఉద్యోగుల సంక్షేమానికి ఎలాంటి సలహాలలిస్తారో అంటూ సందేహం వ్యక్తం చేసారు. ఇక, ఆ తరువాత సచివాలయంలో పీఆర్సీ నివేదిక కోసం రాత్రి వరకు ఉద్యోగ సంఘాల నేతల నిరీక్షణ..ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవటంతో ఈ రోజున మరోసారి ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications