
END OF TDP:జూ ఎన్టీఆర్..బ్రాహ్మణినే దిక్కు : టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యలో పవన్ : సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్.
ఏపీలో టీడీపీలో ఏం జరుగుతోంది. చంద్రబాబు- లోకేస్ పార్టీని రక్షించలేరా. తిరిగి అధికారంలోకి తీసుకురాలేరా. మరి...చంద్రబాబు పర్యటనల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వస్తోంది. వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారు. ఇప్పుడు ఇది టీడీపీలోకే కాదు...రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది. చంద్రబాబుకు సొంత ఇలాకా కుప్పంలో..టీడీపీకి కంచుకోట క్రిష్ణా జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతు గా పార్టీ అధినేత పర్యటనలో జెండాలు..ఫ్లెక్సీలు కనిపించాయి.

# ఎండ్ ఆఫ్ టీడీపీ పేరుతో..
మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో చంద్రబాబుకు జూనియర్ సెగ మొదలైందంటూ చర్చ మొదలైంది. # ఎండ్ ఆఫ్ టీడీపీ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. అందులో వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున చంద్రబాబు..లోకేష్ పైన కామెంట్లు పెడుతున్నారు. టీడీపీ అభిమానులు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, టీడీపీకి భవిష్యత్ లేదని..లోకేశ్ అసమర్దుడని పోస్టు చేస్తూ..బ్రాహ్మణి బెస్టు అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇక, జూనియర్ రావాలని పార్టీ సీనియర్లు..నిజమైన టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారంటూ మరి కొందరు కామెంట్లు చేసారు.

కరువు - చంద్రబాబు కవల పిల్లలంటూ..
ఇదే సమయంలో టీడీపీ అభిమానులు గతంలోనూ టీడీపీని ఫినిష్ చేస్తామని చెప్పిన వ్యక్తి హెలికాఫ్టర్ ఎక్కి ఏమయ్యాడో అందరికీ తెలుసంటూ పోస్టు పెట్టారు. ఇదే సమయంలో చంద్రబాబు కు ఏజెంట్ పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ వైసీపీ ఫ్యాన్స్ కామెంట్స్ కంటిన్యూ చేస్తున్నారు. కరువు-చంద్రబాబు కవల పిల్లలంటూ పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. బాబుకు స్ట్రోక్ మీద స్ట్రోక్ అంటూ భారీగా ట్రోలింగ్ కొనసాగుతోంది. నెక్స్ట్ టీడీపీ సీఎం అభ్యర్ధి జూనియర్ ఎన్టీఆర్..ఇక, చంద్రబాబు-లోకేష్ పని గోవిందా అంటూ మరి కొందరు పోస్టులు చేసారు.

కరోనా కంట్రోల్ చేసే సత్తా ఉంటే...
తాము అధికారంలో ఉంటే కరోనాను కంట్రోల్ చేసే వాళ్లమని తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున రియాక్షన్లు వచ్చాయి. కరోనాను నియంత్రించే శక్తి ఉంటే హైదరాబాద్ లోని ఇంట్లో ఎందుకు దాక్కున్నావు అంటూ వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు సన్ స్ట్రోక్ అంటూ...లోకేశ్ మీద సెటైర్లు వేస్తూ పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. ఇక, తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలోనూ వైసీపీ..టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరి పైన మరొకరు లోపాలు ఎత్తి చూపుతూ తమ నేతలను సమర్ధించుకుంటున్నారు.
Recommended Video

చంద్రబాబు - పవన్ బంధం పైనా..
చంద్రబాబు అధికారంలోకి వస్తేనే తిరిగి ఆర్దికంగా రాష్ట్రం పుంజుకుంటుందని..లోకేష్ సీఎం అభ్యర్ధి కాలేడని..బ్రాహ్మణి మహిళా ఆత్మవిశ్వాసంతో పని చేస్తారంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్రత్యేక హోదా మీద ఎందుకు స్పందించటం లేదంటూ ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ, పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో ఉంటూ చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నారంటూ మరి కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇక, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎండ్ ఆఫ్ టీడీపీ పేరుతో సాగుతున్న టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యలో పవన్ సోషల్ మీడియా వార్ తారా స్థాయికి చేరింది. ఒకరిని మరొకరు ట్రోలింగ్ తో కార్నర్ చేస్తున్నారు.