లిక్కర్ కేసులో వారి గురి పెట్టిన ఈడీ, వరుసగా..!!
లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం. ఇప్పటి వరకు ఈ కేసును విచారణ చేస్తున్న సిట్ పలువురిని విచారణ చేసింది. కొందరిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో సిట్ ఇచ్చిన వివరాల మేరకు ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే పలు మార్లు నిందితుల నివాసాలు.. కార్యాలయా ల్లో సోదాలు చేసారు. ఈ కేసులో వేల కోట్లు చేతులు మారాయనే అభియోగాలు ఉన్నాయి. వీటి పైన విచారణ చేసిన ఈడీ అధికారులు ఏ-1గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అరెస్ట్ చేసినట్లు ప్రచారం సాగుతున్న ఈడీ ఇంకా ధ్రువీకరించలేదు.
ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డితో పాటుగా మరో ఆరుగురు నివాసాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు చేసారు. హవాలా తో పాటుగా మనీ లాండరింగ్ లో ఆధారాలు సేకరించిన ఈడీ రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ కు సంబంధించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. నాడు బేవరేజెస్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి నివాసంలోనూ ఈడీ సోదాలు కొనసాగిస్తోంది. కొద్ది రోజుల క్రితం సోదాలు చేసిన ఈడీ అధికారులు నిందితుల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఆధారాలు సమీకరించారు. ఇప్పుడు ఒకే సారి పది చోట్ల సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు కేసిరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

ఈ ఉదయం నుంచి హైదరాబాద్ లో ఒక్క సారిగా పది ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆరుగురు నిందితుల ఇళ్ల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. కాగా.. ఈ కేసులో అసలు అంతిమ లబ్దిదారు ఎవరనేది ఈడీ ఆరా తీస్తోంది. వాసుదేవరెడ్డి బంధువుల నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కాగా.. ఈడీ ఈ కేసులో త్వరలోనే మాజీ సీఎం జగన్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సాగుతున్న సోదాల్లో కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం సేకరించిన తరువాత జగన్ కు నోటీసులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఇప్పుడు రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న ఈడీ.. తదుపరి అడుగుల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications