వైసీపీ మాజీ మంత్రి కుమారుడిని అరెస్ట్ చేసిన ఈడీ..!!

మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటి వరకు సోదాలు.. విచారణలు చేస్తున్న ఈడీ ఒక్క సారిగా అరెస్టులు చేయటం మొదలు పెట్టింది. హైదరాబాద్ లో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్​ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈడీ.. ఇప్పుడు సునీల్ అరెస్ట్ తో లిస్టులో నెక్స్ట్ ఎవరనే చర్చ మొదలైంది.

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సిట్ పలువురిని విచారణ చేసి అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ .. హవాలా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో నాటి బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి తో పాటుగా ఏ-1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. పలువురి నివాసాలు.. కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ ఇప్పుడు వారిని తమ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేస్తోంది. ఇప్పటికే వారి విచారణలో సేకరించిన సమాచారం తో పాటుగా గుర్తించిన నగదు లావాదేవీల పైన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ కేసిరెడ్డి ప్రధాన సూత్రధారిగా ఉన్న ఈ కేసులో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను గుర్తించారు. వందల కోట్ల మేర అక్రమంగా లావాదేవీలు గుర్తించిన అధికారులు ఈ దిశగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

పవన్ భూ ఆక్రమణ వివాదంపై కోర్టు కీలక ఆదేశాలు..!!
పవన్ భూ ఆక్రమణ వివాదంపై కోర్టు కీలక ఆదేశాలు..!!
enforcement-directorate-arrests-ycp-leader-karumuri-nageswarao-son-sunil-in-liquor-transport-case

ఈడీ హిట్ లిస్టులో నెక్స్ట్..!

కాగా, ఇదే కేసుల మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావును గతంలో సిట్ విచారణ చేసింది. లిక్కర్ రవాణా వ్యవహారంలో కారుమూరి పైన అభియోగాలు ఉన్నాయి. వందల కోట్ల మేర లావా దేవీలు నిర్వహించినట్లు విచారణలో గుర్తించారు. మద్యం రవాణా, టెండర్లు సబ్ కాంట్రాక్టుల అవకతవకల విషయంలో కారుమూరిపై, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. మద్యం రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ.200 నుంచి రూ. 250 కోట్ల వరకు గండి కొట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన కుమారుడిని ఈడీ లావాదేవీల పైన ఆరా తీసింది. దీనికి సంబంధించి ఆధారాలు దొరకటంతో కారుమూరి కుమారుడు సునీల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+