'జగన్‌ది రాయలసీమనా? తెలంగాణనా?: సాక్షిలో ఎందుకలా రాస్తున్నారు?'
వైసీపీ అధినేత జగన్‌ది రాయలసీమనా? తెలంగాణనా? అనేది అసలు అర్థం కావడంలేదని ప్రతాప్ రెడ్డి అన్నారు.
కర్నూలు: వెలుగోడు జలాశయానికి శ్రీశైలం నుంచి నీరు తీసుకుంటే సాక్షి తెలంగాణ ఎడిషన్‌లో 'జల చౌర్యం' అని జగన్ రాయిస్తున్నారని మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ప్రజలకు తాగునీరు, సాగునీరు రాకుండా జగనే అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, వైసీపీ అధినేత జగన్‌ది రాయలసీమనా? తెలంగాణనా? అనేది అసలు అర్థం కావడంలేదని ప్రతాప్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్‌కు సహనమనేది లేదని, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకుంటున్నాడని ఆరోపించారు. మరోవైపు సీఎం చంద్రబాబు అహర్నిశలు రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications