ఎర్రబెల్లిXకడియం, తోపులాట: అలాకాదని బాబును ఏకేసిన కేఈకి దేవినేని అండ

వరంగల్/విజయవాడ: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావుల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. వరంగల్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారిద్దరు మాటల యుద్ధానికి పాల్పడ్డారు.

తన నియోజకవర్గానికి నిధులు తక్కువగా వస్తున్నాయని, వారి అంతు చూస్తానని ఎర్రబెల్లి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వానికి కడియం మోకాలడ్డుతున్నారన్నారు.

దీనికి తెరాస కార్యకర్తలు అడ్డు చెప్పారు. ఎర్రబెల్లితో వాగ్వాదానికి దిగారు. ఎర్రబెల్లికి తెలుగు తమ్ముళ్లు మద్దతుగా నిలిచారు. అనంతరం కడియం మాట్లాడుతూ.. నిధుల ఇవ్వడంలో వివక్ష చూపించడం లేదన్నారు. ఓ దశలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

Errabelli allges TRS government is not giving funds to his constituency

వారి వ్యాఖ్యల్లో దురుద్దేశ్యం లేదు: దేవినేని

చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్‌, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఆదివారం వివరణ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన దేవినేనిని సీఎం చంద్రబాబుపై కేఈ, ఎంపీ శివప్రసాద్‌ చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించారు.

దీనిపై ఆయన మాట్లాడారు. చంద్రబాబు, కార్యకర్తల కష్టఫలితమే టీడీపీ ప్రభుత్వమని, ప్రతి కార్యకర్త రుణాన్ని తీర్చుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీమ జిల్లాలను పట్టించుకోవడం లేదని, కోస్తా జిల్లాలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని ఎంపీ శివప్రసాద్‌, డిప్యుటీ సీఎం కేఈ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+