మేం టర్న్ ఐతే టి రాదు: ఎర్రబెల్లి, అశోక్‌బాబుపై నేతలు

కెసిఆర్ వైఖరి వల్లే తెలంగాణ ఆలస్యమవుతోందని ఆఱోపించారు. తెలంగాణ ప్రజల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారని ఎర్రబెల్లి చెప్పారు. ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వారిని హైదరాబాదుకు ఎవరు రమ్మన్నారని, ఎవరు ఉండమన్నారని ఘాటుగా ప్రశ్నించారు.
అశోక్ బాబుపై మండిపాటు
హైదరాబాదు పైన అశోక్ బాబు మాట్లాడటం విడ్డూరమని తెరాస ఎమ్మెల్యే మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు వేరుగా అన్నారు. హైదరాబాదుపై ఒత్తిడి తెచ్చేందుకు మంత్రులు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి ఇరు ప్రాంతాల్లో మేకప్ వేసే పనిలో బాబు పడ్డారని ఎద్దేవా చేశారు.
హైదరాబాదు నుండి తెలంగాణవారే వెళ్లిపోవాలన్న అశోక్ బాబు వ్యాఖ్యలు దుస్సాహసం అని శాసన మండలి సభ్యుడు స్వామి గౌడ్ అన్నారు. మద్రాసు రాష్ట్రం కంటే ముందే హైదరాబాదులో విద్యుత్ ఉత్పత్తి ఉందన్నారు.












Click it and Unblock the Notifications