అన్ని గుర్తింపు కార్డులెందుకు: గవర్నర్ సంచలన వ్యాఖ్య
హైదరాబాద్: గుర్తింపు కార్డులపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల గుర్తింపు కోసం ఆధార్ కార్డు , పాన్ కార్డు, ఓటర్ ఐడీ లాంటి ఇన్ని కార్డులెందుకని ఆయన ప్రశ్నించారు. అన్ని వివరాలు ఒకే కార్డులో ఉండే విధంగా ప్రత్యేకమైన డిఎన్ఏ డేటాబేస్ కార్డును రూపొందించే దిశగా శాస్త్రవేత్తలు, ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.
శనివారం హైదరాబాద్‌లో జరిగిన జీవశాస్తం, జీవవైద్యం, బయోఫోరెన్సిక్స్ అనే అంశంపై డిఎన్ఏ అంతర్జాతీయ సదస్సుకు గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ప్రతీ ఒక్కరికి ఆధార్ తరహాలో డిఎన్ఏ కార్డును అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని నరసింహన్ అభిప్రాయపడ్డారు. రకరకాల కార్డుల వల్ల ప్రజాధనం వృథా అవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

సైన్స్, టెక్నాలజీ కేవలం ప్రయోగాలకే కాకుండా మానవాళికి ఉపయోగపడేలా ఉండాలని నరసింహన్ వ్యాఖ్యానించారు. నార్కో టెస్ట్, పాలీగ్రాఫ్ పరీక్షలు వాస్తవికంగా లేవని గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. ఆ పరీక్షలు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం ఉందంటున్న శాస్త్రవేత్తలు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నారని గవర్నర్ నరసింహన్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications