జగన్ పెట్రోల్‌తో అంటించుకున్నా: జెసి, ప్రతి బొట్టు పట్టండి: వర్షంతో పులకించిన బాబు!
అనంతపురం/విజయవాడ: అనంతపురం పార్లమెంటు సభ్యుడు, టిడిపి నేత జెసి దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షలు కాదు.. పెట్రోలు పోసుకొని అంటించుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా రాదన్నారు.
జెసి దివాకర్ రెడ్డి గతంలోను ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాజాగా సోమవారం నాడు కూడా అనంతపురం జిల్లాలో ఈ వ్యాఖ్యలు చేశారు. భూమి మీద నడిచే వాళ్లకయితే చెప్పవచ్చునని, వాడు ఆకాశంలో కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా లేదు.. వంకాయ లేదు.. రాదు అన్నారు. ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. హోదా పేరు లేకపోయినప్పటికీ ఆ పేరు మీద ఏపీ అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులు వస్తాయన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుల పైన కాంగ్రెస్ కేసులు పెట్టడంపై స్పందిస్తూ... రఘువీరా చేసేదేం లేదన్నారు. పిఎం, సిఎంల పైన కేసులు పెడితే నమోదు చేస్తారా, ప్రజలకు అది తెలియదా అన్నారు.

ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టండి: చంద్రబాబు
నేలపై పడ్డ ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో గడచిన రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన ఏపీ అధికార యంత్రాంగంతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భూమిపై పడ్డ ప్రతి వర్షపు చినుకును వృథాగా పోనీయకుండా ఒడిసిపట్టాలన్నారు. తద్వారా భూగర్భ జల వనరులను పెంపొందించాలన్నారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఇంకుడు గుంతల పథకాన్ని చేపట్టడమే కాక, నీటి పొదుపుపై భారీ ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications