ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చిన ఏపీ ఎన్జీవో నేత..!!

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తోన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అయిదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మరో నాలుగింటికి ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు.

వైసీపీ అభ్యర్థులకు..

వైసీపీ అభ్యర్థులకు..

ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తోన్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో సీతంరాజు సుధాకర్, తూర్పు రాయలసీమలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ నుంచి వెన్నపూస రవీంద్ర రెడ్డి, రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారని వారికి ఓటు వేయాలని సూచించారు.

ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం..

ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం..

జగన్ ప్రభుత్వానికి ఉద్యోగులు అండగా నిలవాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద, మధ్య తరగతి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగుల అభ్యున్నతి కోసం జగన్ పని చేస్తోన్నారని, అలాంటి ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన కనీస బాధ్యత ఉద్యోగులపై ఉందని ఎన్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చొరవ చూపుతోందని గుర్తు చేశారు.

ప్రొబేషనరీ..

ప్రొబేషనరీ..

గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబెషనరీని కూడా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిందని పేర్కొన్నారు. రెండోదఫాలో ఎంపికైన సచివాలయ ఉద్యోగులకు కూడా ప్రొబేషరీని ఖరారు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో భర్త ఒకచోట, భార్య ఒకచోట పని చేస్తోన్నారని, ఒకేచోట పని చేసేలా బదిలీ చేయాలంటూ వారు కోరుతున్నారని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.

 బదిలీలపైనా..

బదిలీలపైనా..

ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల సమయంలో సచివాలయ ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. 12వ పే రివిజన్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారని, ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి నుంచి అమలు అయ్యేలా ఈ పీఆర్సీని వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.

మెడికల్ రీఎంబర్స్ కోసం..

మెడికల్ రీఎంబర్స్ కోసం..

ఉద్యోగస్తుల మెడికల్ రీఎంబర్స్ మెంట్ ను ఎక్స్ టెన్షన్ కోరారని, దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా తీసుకుందని చంద్రశేఖర్ రెడకడి అన్నారు. అనారోగ్య కారణాలతో విధుల్లో పాల్గొనలేని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రులు చెప్పారని వివరించారు.

సీపీఎస్ రద్దుపై..

సీపీఎస్ రద్దుపై..

సీపీఎస్ ను రద్దు చేయాలనే డిమాండ్ ముందు నుంచీ ఉందని, దీన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై వైఎస్ జగన్.. సానుకూలంగా స్పందిస్తోన్నారని, సీపీఎస్ రద్దు చేసి జీపీఎస్ లేదా ఇంకా మెరుగైన విధానాన్ని తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. ఆయా అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+