మాజీ సీఎం జగన్ కాన్వాయ్ వాహనాలకు ప్రమాదం.. ఒకదానికి మరొకటి ఢీ !!

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా పలువురు గాయపడినట్టు సమాచారం. దీంతో స్వల్ప గందరగోళం నెలకొనగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన పట్ల వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

కాగా మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జగన్ ఇవాళ కృష్ణా జిల్లా పర్యటన చేపట్టారు. ఆయన పెనమలూరు, ఉయ్యూరు, పామర్రు, గూడూరు ప్రాంతాల మీదుగా పర్యటిస్తూ.. తుపాను వల్ల ధాన్యం, పత్తి, మిరప, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్న రైతుల్ని కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అలానే ప్రభుత్వం అందిస్తున్న సాయం, నష్టపరిహారం విషయాలను జగన్ స్వయంగా పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం వరకు పర్యటన కొనసాగి, సాయంత్రానికి అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లి చేరుకుంటారు.

ex-cm-jagans-convoy-vehicles-one-collided-with-another-at-krishna-district

ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక రైతులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. విజయవాడ నుండి మచిలీపట్నం హైవేపైకి ఎక్కడికక్కడ జనసందోహం కనిపిస్తోంది. జగన్ వాహనాల కాన్వాయ్ హైవేపై ప్రయాణిస్తుండగా.. అభిమానులు రోడ్డు పక్కన నిలబడి స్వాగతం పలుకుతూ నినాదాలు చేస్తున్నారు. భారీగా జనాలు రోడ్డుపైకి రావడంతో పోలీసులు రవాణా వ్యవస్థను నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జగన్ టూర్ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్‌ఎన్‌ గొల్లపాలెం ప్రాంతాల్లో మాత్రమే పర్యటించేందుకు జగన్‌కు అనుమతి ఇచ్చారు. అయితే కాన్వాయ్‌లో గరిష్టంగా 10 వాహనాలు, 500 మంది మాత్రమే పాల్గొనాలని ఆదేశించారు. బైక్ ర్యాలీలు, డీజే సౌండ్ సిస్టమ్స్, మైకులు వాడరాదని హెచ్చరించారు. అనుమతి లేకుండా పెద్ద ఎత్తున జనాన్ని తరలించవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఈ ఆంక్షలపై వైసీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే ఇన్ని అడ్డంకులు ఎందుకని?" అని ప్రశ్నిస్తున్నారు.

ex-cm-jagans-convoy-vehicles-one-collided-with-another-at-krishna-district
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+