'అన్ స్టాపబుల్' లో 3 రాజధానులపై సంచలన వ్యాఖ్యలు

నందమూరి బాలకృష్ణ నట జీవితాన్ని రెండుగా వర్గీకరించవచ్చు. అన్ స్టాపబుల్ కు ముందు బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ అని. హోస్ట్ గా బాలయ్య ప్రజల్ని అంతగా ఆకట్టుకున్నారు. మొదటి సీజన్ లో పూర్తిగా సినిమా వర్గానికి చెందినవారే గెస్ట్ లుగా వచ్చారు. కానీ రెండో సీజన్ లో తొలి షోను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో నిర్వహించి ఆశ్చర్యపరిచారు.

మొదటి ప్రోమోలో స్నేహం

మొదటి ప్రోమోలో స్నేహం


దీని తర్వాత రెండు ఎపిసోడ్లు యువ కథానాయకులతో చేసిన బాలకృష్ణ నాలుగో ఎపిసోడ్ లో తన స్నేహితులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించి విడుదలైన మొదటి ప్రోమోలో బాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య ఉన్న స్నేహాన్ని, కాలేజీ రోజుల్ని పంచుకోవడంతోపాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వం, గొప్పతనం గురించి చెప్పారు.

ఇప్పుడున్న లిటిగేషన్స్ తో..

ఇప్పుడున్న లిటిగేషన్స్ తో..


తాజాగా రెండో ప్రోమో విడుదలైంది. ఇందులో చాలా రాజకీయ అంశాలను బాలయ్య ప్రస్తావించారు. ఏపీలో మూడు రాజధానులకు సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిపై బాలకృష్ణ ప్రశ్నల వర్షం కురిపించారు. మూడు రాజధానుల గురించి వారు ఏం మాట్లాడారు? ఎలా స్పందించారు? వారి సమాధానం ఏమై ఉంటుందా? అనే ఉత్కంఠ ప్రోమో చూసినవారిలో నెలకొంది. వారి సమాధానాన్ని ప్రోమోలో ఎలా చూపించారంటే.. ''దీనికి ముందున్న పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న లిటిగేషన్స్ తో'' అంటూ కిరణ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే ఆయన పూర్తి సమాధానం ఏమిటి? అనేది సస్పెన్స్ గా ఉంచారు.

 భిన్నత్వంలో ఏకత్వం

భిన్నత్వంలో ఏకత్వం


మరోవైపు ఇదే విషయాన్ని గురించి సురేష్ రెడ్డి ఏప'భిన్నత్వంలో ఏకత్వం కాదు.. భిన్నత్వమే ఏకత్వం' అంటూ సమాధానమిచ్చారు. వీరిద్దరూ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్ వైఖరిని తప్పుబట్టారా? సమర్థించారా? లేదంటే ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయాన్ని సూచించారా? అనేది తెలుసుకోవాలంటే 25వ తేదీన ప్రసారం కానున్న షో చూడాల్సిందే. ఈ ఎపిసోడ్ కూడా రాజకీయంగా చర్చకు దారితీసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+