గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ వద్దకు సుచరిత - పార్టీలో వారి పెత్తనం పైనే : రాజీనామా పైనా క్లారిటీ..!!

|
Google Oneindia TeluguNews

మాజీ హోం మంత్రి సుచరిత నిర్ణయం ఏంటి. ఏం చేయబోతున్నారు. ఏపీలో కేబినెట్ విస్తరణలో మొదలైన అసంతృప్తి నెమ్మదిగా తగ్గుతోంది. మంత్రి పదవి దక్కని సీనియరర్లు ఒక్కొక్కరుగా సీఎం జగన్ తో సమావేశమవుతున్నారు. వారికి సీఎం వారి భవిష్యత్ పైన భరోసా ఇస్తున్నారు. 2024 ఎన్నికల పైన వారికి బాధ్యతలు కేటాయిస్తున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే ప్రాధాన్యత దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. అయితే , సీఎం వద్దకు వెళ్లే వారకు అలక బూనినట్లు కనిపించిన నేతుల..ఆ తరువాత బయటకు వచ్చి..అసలు తమకు ఎటువంటి అసంతృప్తి లేదని చెబుతున్నారు.

అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా..

అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా..

ఇప్పటికే పార్టీ సీనియర్లు బాలినేని..పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి.. పార్ధసాధి..ఉదయభాను వంటి నేతలు సీఎం జగన్ ను కలిసారు. ఆ తరువాత వారు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటమే తయ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రివర్గ కూర్పు ఫైనల్ కాగానే.. తొలుత నిరసనలు మొదలైంది గుంటూరు జిల్లాలోనే.

అందులో మాజీ హోం మంత్రి సుచరిత అనుచరులు ఆందోళనకు దిగారు. గత కేబినెట్ లో పని చేసిన ఎస్సీలందరికీ తిరిగి మంత్రి పదవులు ఇచ్చి..తనకు ఇవ్వకపోవటం పైనా అసంతృప్తి - ఆవేదన వ్యక్తం చేసారు. బుజ్జగింపుల కోసం వచ్చిన రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణకు రాజీనామా లేఖ ఇచ్చినట్లు సుచరిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆ తరువాత కార్యకర్తలతోనూ సుచరిత తన రాజీనామా అంశాన్ని ప్రస్తావించారు. తాను వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసానని.. పార్టీకి కాదని స్పష్టం చేసారు.

రాజీనామా లేఖ అందలేదంటూ

రాజీనామా లేఖ అందలేదంటూ

అయితే, స్పీకర్ తమ్మినేని తనకు సుచరిత రాజీనామా లేఖ అందలేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తనకు మంత్రి పదవి రాలేదని బాధ కంటే..పార్టీలో కొత్తగా వచ్చిన వారి పెత్తనం ఇబ్బందిగా మారిందంటూ వ్యాఖ్యానించారు. తాము తొలి నుంచి వైఎస్సార్ ఫ్యామిలీకి విధేయుగా ఉన్నామంటూ గుర్తు చేసారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే..జగన్ కోసం పార్టీ వీడి..ఉప ఎన్నికల్లో పోటీ చేసామని చెప్పుకొచ్చారు.

ఇక, ఈ రోజు సుచరిత సీఎం జగన్ తో సమావేశం కానున్నట్లు విశ్వస నీయ సమాచారం. మంగళవారమే కలవాల్సి ఉన్నా..ఈ రోజు కలుస్తానంటూ సమాచారం ఇచ్చారు. దీని ద్వారా ఎస్సీ మంత్రులకు అందరికీ తిరిగి అవకాశం ఇచ్చినా..తనను మాత్రమే పక్కన పెట్టటం పైనే సుచరింత ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.

సీఎం జగన్ తో భేటీ సమయంలో

సీఎం జగన్ తో భేటీ సమయంలో

తన అనుచరులతో ఇప్పటికే ఆందోళనలు వద్దని..ఎవరూ పార్టీకి రాజీనామాలు చేయవద్దని స్పష్టం చేసారు. ఇక, సీఎం జగన్ తో సమావేశం తరువాత సుచరిత ఇతర నేతల తరహాలోనే తన అసంతృప్తి గురించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో రాజీనామా అంశం పైన క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణ వేళ.. కొంత అసంతృప్తులు సహజమని.. ఇవన్నీ ఒకటి రెండు రోజుల్లోనే సమిసిపోతాయని సీనియర్లు చెప్పుకొస్తున్నారు.

మిగిలిన నేతలు అందరూ ఇప్పటికే జగన్ కోసం తాము వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేస్తామని స్పష్టం చేసారు. అయితే, ఇతరుల కంటే ఒక అడుగు ముందుకేసి..రాజీనామా లేఖ ఇచ్చానని చెబుతున్న సుచరిత..సీఎంతో సమావేశం తరువాత ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Mekathoti Sucharitha meet CM Jagan To day after her resignation to mla, She may explain the reason for her decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X