టీడీపీలోకి మాజీ మంత్రి అవంతి - క్లారిటీ ఇచ్చేసారు..!!
మాజీ మంత్రి..ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస రావు పార్టీ వైసీపీ వీడుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన టీడీపీలోకి తిరిగి వెళ్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే సీటు గురించి ప్రచారం మొదలైంది. ఇప్పుడు దీని పైన అవంతి శ్రీనివాస్ స్పందించారు. విశాఖ కేంద్రంగా అవంతి శ్రీనివాస్ కీలక నేతగా ఉన్నారు.
గతంలో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అక్కడి మాజీ నేతల పైన గురి పెట్టిందనే ప్రచారం సాగుతోంది. దీంతో అవంతి వ్యవహారం పైన చర్చ మొదలైంది.

అవంతి శ్రీనివాసరావు ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత గంటాతో కలిసి 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. అప్పుడు ఎమ్మెల్యే సీటు ఆశించినా ఎంపీ సీటు ఇవ్వటంతో అయిష్టంగానే పోటీ చేసారు. ఎంపీగా గెలిచారు. గంటా 2014లో చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. అవంతి ఎంపీగా ఢిల్లీకి పరిమితం కావాల్సి వచ్చింది.
అప్పటి వరకు ఐక్యంగా కనిపించిన గంటా - అవంతి మధ్య క్రమేణా గ్యాప్ పెరిగింది. ఆ తరువాత 2019 ఎన్నికల సమయంలో అవంతి వైసీపీలో చేరారు. భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ తొలి కేబినెట్ లో మంత్రి అయ్యారు.
మంత్రి అయిన సమయం నుంచి టీడీపీ - గంటా టార్గెట్ గా అవంతి విరుచుకుపడేవారు. కేబినెట్ విస్తరణ సమయంలో అవంతి మంత్రి పదవి కోల్పోయారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి గుడివాడ అమర్నాధ్, బూడి ముత్యాల నాయుడు మంత్రులుగా కేబినెట్ లో అవకాశం దక్కించుకున్నారు. టీడీపీ వీడుతారని ప్రచారం జరిగిన గంటా వైఖరిలో కొంత కాలంగా మార్పు వచ్చింది.
అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ను కలవటంతో పాటుగా పవన్ కు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్రుల ఫలితాల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో, విశాఖకు చెందిన మాజీ టీడీపీ నేతలు తిరిగి పార్టీలోకి వస్తున్నారంటూ ప్రచారం మొదలైంది.
దీని పైన మాజీ మంత్రి అవంతి స్పష్టత ఇచ్చారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీతోనే ఉంటానని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. త్వరలో టీడీపీలోకి వెళ్లిపోతున్నానని, అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని పలువురు చేస్తున్న దుష్ప్రచారాన్ని అవంతి ఖండించారు.
ఆసరా, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకులు మైండ్ గేమ్ ఆడుతూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షనేతలకు పుట్టగతులుండవని వ్యాఖ్యానించారు. జగన్మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications