కిరణ్ రెడ్డి మోసగాడు, చిరు సీఎం అయితే మరోలా ఉండేది: మాజీ మంత్రి డొక్కా సంచలన వ్యాఖ్యలు
అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోశయ్యను సీఎం పదవి నుంచి దించేస్తూ ఉమ్మడి రాష్ట్రానికి కొత్త సీఎంను నియమిస్తున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి తానో లేఖ రాశానని చెప్పుకొచ్చాడు. హైకమాండ్‌కు పలు కీలక అంశాలను ఆ లేఖలో సూచించానని తెలిపారు.

అప్పటి వరకు స్పీకర్‌గా కొనసాగి సీఎం పీఠం ఎక్కేందుకు సిద్ధమైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పచ్చి మోసగాడని ఆ లేఖలో అధిష్టానానికి వివరించానని తెలిపారు. అంతేకాకుండా చిరంజీవిని సీఎంను చేయాలని కూడా తాను సూచించానన్నారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్ధానంలో చిరంజీవి సీఎం అయి ఉంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్ధితి ఇలా ఉండేది కాదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications