వైఎస్ జగన్‌పై కోడెలపై పెట్టిన కేసు పెడుతున్నారు?
సొంత ఇంటికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చ జరగడానికి కారణం దివంగత స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం. ప్రజాధనంతో ఫర్నిచర్ ను సొంతానికి వినియోగించుకుంటున్న మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేయాలంటూ కోడెల శివరాం ఓ ప్రకటన విడుదల చేశారు. తనవద్ద ప్రభుత్వ ఫర్నిచర్ ఉందని లేఖరాసి.. దాన్ని తీసుకువెళ్లవచ్చని, లేదంటే ఖరీదు కడితే చెల్లిస్తానని తన తండ్రి కోడెల చెబితే దాన్ని దొంగతనంగా ప్రచారం చేసి, ఆయన పరువుతీసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని శివరాం ఆవేదన వ్యక్తం చేశారు.
గోపిరెడ్డి ఫిర్యాదుతో..
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫిర్యాదుతోనే కేసు నమోదైందని, ఐపీసీ 409 సెక్షన్ కింద పది సంవత్సరాలు శిక్ష పడేలా కేసు పెట్టారన్నారు. అదే జగన్ ఈరోజు తాడేపల్లిలో, లోటస్ పాండ్ లో ఇళ్ల మరమ్మతుల కోసం రూ.18 కోట్లు ఖర్చుచేశారని శివరాం లేఖలో తెలిపారు. ప్రజలను కలవడానికి చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రజావేదికను కూల్చివేయించారని, ప్రస్తుతం జగన్ తన నివాసంలో సీఎంవో కింద తెచ్చిన ఫర్నిచర్ ఇచ్చేస్తానని కనీసం ఇప్పటివరకు లేఖ రాయలేదన్నారు. ఆ ఫర్నిచర్ ఇవ్వనందుకు కోడెలపై నమోదు చేసిన కేసును జగన్ పై కూడా పెట్టొచ్చుకదా అన్నారు.

5 నెలల్లో రూ.15 కోట్ల ఖర్చు
ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే తన క్యాంప్ కార్యాలయానికి కిటికీలతో సహా రూ.15 కోట్లకు పైగా ఖర్చుచేసి సోకులు చేయించారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఐదు సంవత్సరాలు అక్కడినుంచే పాలన చేసి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత దాన్ని పార్టీ కార్యాలయంగా వాడుతున్నారని, ప్రజాధనం పెట్టి కొన్నవన్నీ ఎందుకు వెనక్కి ఇవ్వరని, కోడెలకు ఓ న్యాయం.. జగన్ కు మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.
కేసులు పెట్టడం ఖాయమా?
వాస్తవానికి జగన్ ఇంటికి అంతకన్నా ఎక్కువే ఖర్చుపెట్టారని, జీవోలు బయటకు వస్తున్నాయనే కారణంతో జీవోఐఆర్ ను ఎత్తేశారంటున్నారు. ప్రభుత్వం లెక్కలు తీస్తే ప్రజాధనాన్ని ఎంత ఖర్చుచేశారో బయటకు వస్తుందని, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తన ఇంటికి ప్రభుత్వ సొమ్ము రూపాయి కూడా ఖర్చుపెట్టుకోరని, జగన్ మాత్రం అన్నిటికీ అతీతమని, కచ్చితంగా ఆయనపై కోడెలపై నమోదు చేసిన కేసులే నమోదు చేయాలంటున్నారు.












Click it and Unblock the Notifications