కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపిలోకి కోట్ల చేరిక వాయిదా : అసలు కార‌ణం అదే..!

|
Google Oneindia TeluguNews

క‌ర్నూలు జిల్లా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌..కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్ర‌కాశ రెడ్డి టిడిపి లో చేరిక వాయిదా ప‌డింది. ఈ నెల 28న కోడుమూరు లొ ల‌క్ష మందితో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి ఆ స‌భ‌లో తాము టిడిపి లో చేరుతామ‌ని ఇప్ప‌టికే కోట్ల కుటంబ స‌భ్యులు ప్ర‌క‌టించారు. అయితే, ఇప్పుడు అది వాయిదా ప‌డింది...

28న చేరిక వాయిదా..

28న చేరిక వాయిదా..

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి టిడిపి లో చేరిక వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే అమ‌రావ‌తి లో ముఖ్య‌మంత్రి తో స‌మావేశ‌మైన కోట్ల కుటుంబం తాము టిడిపిలోకి రావటానికి అభ్యంత‌రం లేద‌ని..అయితే జిల్లాలో కొన్ని ప‌నులను చేయాల్సి ఉంటుంద‌ని సీయం కు విజ్ఞ‌ప్తి చేసారు. వారి కోరిక మేర‌కు జిల్లాకు గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టు, ఎల్లెల్సీ బైపాస్‌ పైప్‌లైన్‌ కెనాల్‌ ఇస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధమని కోట్ల ప్రకటించారు. ఈ మూడు ప్రాజెక్టులతో పాటు ఆర్డీఎస్‌ ప్రాజెక్టుకు కూడా ముఖ్యమంత్రి అనుమతులు, నిధులు ఇస్తూ జీవో జారీ చేశారు. అదే విధంగా కోట్ల కుటుంబానికి ఒక లోక్‌స‌భ‌.. ఒక అసెంబ్లీ ఇవ్వ‌టానికి సీయం అంగీక‌రించారు. అదే స‌మ‌యంలో జిల్లాలో ఇబ్బంది లేకుండా కెఇ కుటుం బానికి సైతం డోన్, ప‌త్తికొండ సీట్లు ఇస్తున్న‌ట్లు సీయం వారికి హామీ ఇచ్చారు. దీంతో..ఇక‌, కోట్ల చేరిక మాత్ర‌మే మిగిలి ఉంద‌ని అందరూ భావించారు. ఇంత‌లో ఈ చేరిక వాయిదా పడింది.

చంద్ర‌బాబు ఇలా చెప్పార‌ని..

చంద్ర‌బాబు ఇలా చెప్పార‌ని..

కోట్ల ఈ నెల 28న టిడిపి లో చేరాల‌ని తొలుత నిర్ణ‌యించారు. అయితే , ఈ నెల 28న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్‌ టీడీపీ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్‌ కుమారుడు కేఈ నితిన్‌, అక్షితల వివాహం గోవాలో జరగనుంది. పెళ్లికి రెండు మూడు రోజుల ముందే డిప్యూటీ సీఎం కేఈతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గోవాకు వెళుతున్నారు. 28న కోట్ల కుటుంబం టీడీపీలో చేరాలని భావించింది. కోట్ల, కేఈ కుటుంబాల మధ్య దశాబ్దాల రాజకీ య వైరం ఉంది.

సీయం సైతం పున‌రాలో చ‌న‌లో ప‌డ్డారు.

సీయం సైతం పున‌రాలో చ‌న‌లో ప‌డ్డారు.

ఈ నేపథ్యంలో 28న కోడుమూరు సభకు రాలేకపోతే ప్రజలకు మరో విధంగా సంకేతం వెళ్లే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు స‌మాచారం. దీంతో సీయం సైతం పున‌రాలో చ‌న‌లో ప‌డ్డారు. కోట్ల చేరిక సమయంలో రెండు కుటుంబాలు ఉంటేనే కార్యకర్తలకు మంచి సందేశం వెలుతుందని సీఎం భావించారు. దీంతో 28వ తేదీన నిర్వహించాల్సిన సభను మార్చి 2కి వాయిదా వేసుకోవాలని కోట్లకు సీఎం సూ చించినట్లు తెలిసింది. దీంతో బహిరంగ సభ తేదీని 2వ తేదీ నిర్వహించాలని కోట్ల వర్గం నిర్ణయించింది.

English summary
ex Central Minister Kotla Surya prakash Reddy joining in TDp has been post phoned. Actually Kotla Family to join in TDP 28th of this month. But, on 28th of this month Marriage in K.E Family. with this reason joining has changed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X