వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి- తారక్ అభిమానుల ఓటు జగన్ కే -కేసీఆర్ అంటే పవన్ కు గజగజ: పేర్ని నాని..!!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కల్యాన్ పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ ముఖ్యమంత్రి జగన్.. వైసీపీ పైన చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. 175 సీట్లు గెలిస్తే నోట్లో వేలు పెట్టుకొని చూస్తూ కూర్చుంటామా అని పవన్ ప్రశ్నిస్తున్నారని..151 సీట్లు వచ్చినప్పుడు అలాచే చూసారని..2024లోనూ చూస్తారని వ్యాఖ్యానించారు. ప్రధానితో ఏం మాట్లాడిందీ తమకు అవసరం లేదని..ఏం మాట్లాడారో తెలియక టెన్షన్ పడుతున్న చంద్రబాబుకు చెప్పాలని సూచించారు. కేసీఆర్ అంటే పవన్ కు గజగజ అని పేర్ని నాని ఎద్దేవా చేసారు. మా కాపులందరినీ పొట్లం కట్టి చంద్రబాబుకు అమ్మేసేందుకు ఉన్నావా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ చెప్పినట్లు అది విప్లవ సేన కాదని..కిరాయి విప్లవ సేనగా అభివర్ణించారు.

Ex Minister Perni Nani fires on Pawan Kalyan, Demands to contest in 175 seats against YCP

పవన్ అభిమానులే కాదు..ఆ హీరోల ఫ్యాన్స్ మాకే ఓటు
తన అభిమానులు జగన్ కు ఓటు వేసారని పవన్ వ్యాఖ్యానించారు. దీని పైన స్పందించిన పేర్ని నాని పవన్ అభిమానులే కాదని.. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు అభిమానులంతా జనగ్ కే ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు. వారంతా హీరోలుగా వారిని అభిమానించినా.. రాజకీయంగా జగన్ కు మద్దతుగా నిలుస్తారని వివరించారు. కాపు, బలిజ, తూర్పు కాపు లతో సమావేశాలు నిర్వహించి వారిని చంద్రబాబు కు అమ్మేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వీరితో మాట్లాడిన పవన్ మున్నూరు కాపుల జోలికి వెళ్లరన్నారు. అక్కడ కేసీఆర్ ఉన్నారని..ఆయనంటే పవన్ కు గజగజ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్ దగ్గర అధికారం ఉన్నా లేకున్నాఏడ్చింది ఎవరని ప్రశ్నించారు.

Ex Minister Perni Nani fires on Pawan Kalyan, Demands to contest in 175 seats against YCP

జనసైనికులు అమాయకులు..వారితో ఇలా
జగన్ ప్రజలను నమ్ముకున్నారని చెప్పుకొచ్చారు. జగన్ గెలుపును అడ్డుకోవటం పవన్ కు సాధ్యం కాదని పేర్ని నాని తేల్చి చెప్పారు. ప్రజల గుండెల్లో నిలిచిన జగన్ ను ఏం చేయగలవని నాని సవాల్ చేసారు. ఇప్పటంలో పవన్ వచ్చారని ఏదీ ఆగలేదన్నారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే పవన్ ఉన్నారని విమర్శించారు. పవన్ కు ప్రతీ సారి వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పటం అలవాటు అయిందన్నారు. పవన్ వలన అది కాదన్నారు. ప్రధఆని మోదీ కాలు పట్టుకున్న పవన్ ఆ తరువాత చంద్రబాబు తో చేరారని విమర్శించారు. పవన్ ను అభిమానించే వారంతా ఎప్పుడు ఏ జెండా మోయాలో తెలియక జనసైనికులు ఇబ్బంది పడుతున్నారని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

Ex Minister Perni Nani fires on Pawan Kalyan, Demands to contest in 175 seats against YCP

కాపులందరినీ తాకట్టు పెట్టానికి ఉన్నావా
మా కాపులందరినీ తాకట్టు పెట్టానికి ఉన్నావా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. నీవు జగన్ తో పోటీ పడాలంటే..షంషేర్ గా 175 సీట్లలో పోటీ చేయాలని నాని సవాల్ చేసారు. సినిమాల్లో కాదు..రాజకీయాల్లో తెగువ గుండె ధైర్యం చూపించాంటూ సూచించారు. పవన్ ను ఇతర కులాల వారు మాట్లాడితే బాధ పడతారని..కాపు వర్గానికి చెందిన వాళ్లమే మాట్లాడుతున్నామని పేర్ని నాని చెప్పుకొచ్చారు. కాపు కులాన్ని పొట్లాం కట్టి అమ్మేయద్దని మా వాడికి చెప్పటానికి మేము వస్తున్నామన్నారు. చంద్రబాబు అభిమానుల సంఘం అధ్యకుడు రామోజీ అయితే, ప్రధాన కార్యదర్శి పవన్ గా పేర్కొన్నారు. ఏపీకి బీజేపీ వలన దమ్మిడి ఉపయోగం ఉందా అని ప్రశ్నించారు. ప్రజల కోసం చేసిన పనికి డబ్బ కొట్టుకుంటే తప్పు ఏమి ఉందని ప్రశ్నించారు.

English summary
Ex Minister Perni Nani Seriously Reacted on Janasena Chief Pawan Kalyan comments on CM Jagan and YSRCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X