ఆ తల్లికి సమాధానం చెప్పే ధైర్యం పవన్ కల్యాణ్‌కు ఉందా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా వెళ్లారు. అయితే ఈ కార్యక్రమం నుంచి తిరిగి వెళుతూ ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పవన్ కల్యాణ్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం ప్రకటించారు.కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆ ఇద్దరు మరణించారని పవన్ ఆరోపించారు.
పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆమె పలు ప్రశ్నలు సంధించారు. కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండంటూ పవన్ కల్యాణ్‌ను రోజా నిలదీశారు.''సేవ్ ఏపీ'' అనే హ్యాష్ ట్యాగ్‌ను తన పోస్టుకు రోజా జత చేశారు.

ఇదిలా ఉంటే ..మరణించిన అభిమానుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొవద్దని చెప్పినా, తమ మాట వినకుండా వెళ్లి ప్రాణాలు కోల్పోయారని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరోవైపు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరో, అభిమానులు చనిపోతే మాత్రం రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దూలుపుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వారి ప్రాణాల విలువ కేవలం రూ.5 లక్షలేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరును వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తప్పుపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నీతులు చెప్పడం వరకేనని, ఆచరణ ఉండదని విమర్శించారు. గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని శ్యామల ఎద్దేవా చేశారు.
కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్‌కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సర్ SEIZE THE ROAD... అనాలి కదా? అంటూ ఆమె పవన్ కల్యాణ్‌కు కౌంటరిచ్చారు. సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈలలు వేసి గోల చేయండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా అని ఆమె పవన్‌ను ప్రశ్నించారు.మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పరామర్శించారా?... అంటే, మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా?" అంటూ శ్యామల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications