ఓవర్ టేక్ ప్రయత్నంలో ఘోర ప్రమాదం: మాజీ మంత్రి కుమారుడి మృతి

అనంతపురం: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మాజీ మంత్రి కుమారుడితో పాటు ఆయన బంధువు మరణించారు. మందు వెళ్తున్న వాహనాన్ని దాటేసే ప్రయత్నంలో కారు వేగం పెంచడంతో అది అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

మృతుల్లో ఒకతను మాజీ మంత్రి గుడమ్మగారి నాగిరెడ్డి కుమారుడు సతీష్ రెడ్డి కాగా, మరొకతను ఆయన బంధువు రామకృష్ణా రెడ్డి. ఈ ప్రమాదం అనంతపురం జిల్లా బత్తులపల్లి మండలం మరుగొడ్డువంక వద్ద శుక్రవారంనాడు జరిగింది.

Ex minister's son dies in road accident in Ananthpur district

అనంతపురం నుంచి తన స్వగ్రామం తాడిమర్రి మండలం దాడితోటకు స్కార్పియో వాహనంలో బయలుదేరిన సతీష్ రెడ్డి మరుగొడ్డువంక వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు.

ఆ ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+