'ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవను రాష్ట్రాల సమస్యగా మార్చారు'
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులపై మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రెండు పార్టీలకు చెందిన అధ్యక్షుల గొడవలను, రాష్ట్రాల సమస్యగా మార్చారని మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాలు, బాధ్యతలపై విభజన చట్టంలోనే ఉందని ఆయన గుర్తు చేశారు.

రెండు రాష్ట్రాల్లో ఏడాది పాలన పూర్తైన తర్వాత ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఎలాంటి శాంతిభద్రతల సమస్య లేకపోయినా, కొత్తగా ఇప్పుడు సెక్షన్ 8 అంశం తెరపైకి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తిరుమలలో మతిస్ధిమితం లేని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. జీఎన్‌సీ టోల్‌గేట్ వద్ద బీభత్సం సృష్టించడమే కాకుండా, అటుగా వెళ్లే భక్తులపై దాడికి యత్నించాడు.
దీంతో వెంటనే భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications