Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ వీడిన మాజీ మంత్రులకు బిగ్ ట్విస్ట్, కీలక పరిణామాలు..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. రానున్న ఎన్నికలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు తాజాగా కార్యాచరణ ఖరారు చేసారు. వైసీపీ లక్ష్యంగా టీడీపీ రాజకీయ అడుగులు వేస్తోంది. అటు జగన్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కాగా.. వైసీపీ నుంచి పార్టీ వీడిన మాజీ మంత్రులు చేరిన పార్టీల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు. దీంతో..వారి ముందున్న ఆప్షన్ల పైన కొత్త చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత మాజీ మంత్రులతో సహా పలువురు నేతలు పార్టీ వీడారు. జగన్ వద్ద కీలక పదవుల్లో పని చేసిన వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. విజయ సాయిరెడ్డి సహా మాజీ మంత్రులు ఈ లిస్టులో ఉన్నారు. సాయిరెడ్డి తాజాగా తాను తిరిగి రాజకీయంగా ఎంట్రీ ఇవ్వటం పైన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. సాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయమనే చర్చ సాగుతోంది. ఇక.. జగన్ కు బంధువు.. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేత బాలినేని జనసేనలో చేరారు. ఆ పార్టీ లో చేరి నెలలు అవుతున్నా... ఆయనకు తగిన గుర్తింపు దక్కటం లేదనే చర్చ సాగుతోంది. జనసేన మిత్రపక్షం టీడీపీ స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు బాలినేనితో కలిసి పని చేయటానికి సుముఖంగా లేరు. అదే సమయంలో బాలినేనికి ఎలాంటి పదవి.. బాధ్యతలు అప్పగించలేదు. దీంతో, తన వర్గాన్ని కాపాడు కోవటానికి బాలినేని ప్రయత్నం చేస్తున్నారు.

Ex Ministers facing tough political situation after leaving YSRCP here the details

ఇక, కాపు వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా పని చేసిన ఆళ్ల నాని పరిస్థితి ఇదే విధంగా ఉందని చర్చ జరుగుతోంది. ఆళ్లనాని తెలుగుదేశం పార్టీలో చేరి నెలలు గడుస్తున్నాయి. నాని చేరికను తొలి నుం చి టీడీపీ ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయినా, పార్టీలో చేరారు. టీడీపీ శ్రేణులు మాత్రం నాని తమ నేతగా అంగీకరించటం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేదు. ఇంత దానికి పార్టీ మారటం ఎందుకని అనుచరుల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. టీడీపీ కార్యాలయం వద్దకు నాని వెళ్లలేని పరిస్థితి. జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మర్చిపోయి.. పార్టీ ఓడగానే టీడీపీలోకి వెళ్లిన నానికి ఇప్పుడు భవిష్యత్ అంతు చిక్కటం లేదు. కేడర్ నుంచి సరైన నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. అదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి పరిస్థితి ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.

Ex Ministers facing tough political situation after leaving YSRCP here the details

మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో ఓడినా.. ఎమ్మెల్సీ చేసి మంత్రిగా జగన్ అవకాశం కల్పించారు. ఆ తరువాత రాజ్యసభకు పంపారు. అయితే, 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిన తరువాత రాజ్యసభతో పాటుగా వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి టీడీపీలో చేరారు. ఇప్పటి వరకు ఆయన కు ఎలాంటి పదవి దక్కలేదు. టీడీపీ కార్యక్రమాల్లోనూ కనిపించటం లేదు. అదే విధంగా..వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి ఎన్నికల ముందు వెళ్లిన వారి పరిస్థితి బాగానే ఉంది. కొందరు మంత్రు లు అయ్యారు. ఈ మాజీ మంత్రులు మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీల్లోకి వెళ్లిన తరువాత వెనక్కు రాలేక.. ఆ పార్టీ శ్రేణుల నుంచి మద్దతు లేక డైలమాలో పడ్డారు. అయితే, వీరు ఎన్నికల నాటికి తిరిగి వైసీపీలోకి వస్తారనే చర్చ నియోజకవర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. వైసీపీ నేతలు మాత్రం వారికి తిరిగి రీ ఎంట్రీకి అవకాశం ఉండదని తేల్చి చెబుతున్నారు. దీంతో.. వీరి విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+