28న టిడిపిలో కోట్ల చేరిక : ఒక ఎంపి..ఒక ఎమ్మెల్యే సీటు : లక్ష మందితో బహిరంగ సభ..!
కొద్ది రోజులుగా సాగుతున్న చర్చ ఓ కొలిక్కి వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్ర కాశ్ రెడ్డి టిడిపిలో చేరటనికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి టిడిపి లో చేరాలని నిర్ణయించారు. ఇందు కోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.

28న టిడిపిలో చేరిక..
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈనెల 28న తెదేపాలో చేరనున్నారు. ఇందుకోసం కోడుమూరులోని ఆర్‌అం డ్బీ అతిథి గృహం సమీపంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే మైదానంలో గతేడాది నవంబరు 11న కాంగ్రెస్ పార్టీ రైతు మహాసభ జరిగింది. దానికన్నా భారీగా లక్ష మంది కార్యకర్తలతో ఈ సభ నిర్వహించడానికి కసరత్తు జరుగుతోంది. తదనుగుణంగా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేకరణ చేస్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో సూర్యప్రకాశ్‌రెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయ న రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తో సమావేశమైన సమయంలో తాము టిడిపి లో చేరాలంటే ముందుగా అక్కడ సాగు నీటి ప్రాజెక్టుల పై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా తమకు కేటా యించాల్సిన సీట్ల పైనా కొన్ని ప్రతిపాదనలు చేసారు.

ఒక లోక్‌సభ..ఒక అసెంబ్లీ..
కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా తెదేపా తరఫున బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఆలూరు, డోన్ అసెం బ్లీ నియోజకవర్గాలూ తమకు కేటాయించాలని కోట్ల కుటుంబం ప్రతిపాదించింది. మరో వైపు ఉప ముఖ్యమంత్రి కేఈ కుటుంబం సీఎంతో భేటీ అయినప్పుడు పత్తికొండ, డోన్ తమకే కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ డోన్ కేఈ కుటుంబానికే ఇస్తే ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారు. ఈ మేరకు టిడిపి నేతలు కోట్ల కుటంబానికి వివరించినట్లు సమాచారం.

పత్తికొండ సీటు తమ కుమారుడికి
దీని పై కోట్ల కుటంబం సైతం అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కెఇ కుటుంబానికి పత్తి కొండ, డోన్ కేటాయించే విధంగా సీయం నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే, పత్తికొండ సీటు తమ కుమారుడికి ఇవ్వాలని కెఇ కృష్ణమూర్తి ప్రతిపాదిస్తున్నారు. దీని పై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోలేదు. ఇక, కోట్ల కుమారుడు రాఘవేంద్రరెడ్డికి ఏదైనా పదవి కేటాయించే అవకాశం ఉండనుంది.












Click it and Unblock the Notifications