నాకు ప్రాధాన్యత ఇవ్వరా : టిటిడి వారి సేవలో తరిస్తోంది : వైసిపి నేత హల్‌చల్
వైకుంఠ ఏకాదశి నాడు తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం పై వైసిపి నేత..మాజీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. టిటిడి లోని సభ్యులు కొందరి సేవలకే పరిమితం అయ్యారని విరుచుకుపడ్డారు. తిరుమల లోని జెఈవో కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే గట్టి గట్టిగా మాట్లాడుతూ హంగామా చేసారు. దీనికి జెఈవో సైతం గట్టిగానే రియాక్ట్ అయ్యారు.
వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకొనేందుకు మాజీ ఎమ్మెల్యే..వైసిపి నేత తిరుమల కు వచ్చారు. అయితే, వైకుంఠ ఏకాదశి పాసుల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఓ మాజీ ఎమ్మెల్యే టీటీడీ అధికారులపై విరుచుకుపడ్డా రు. తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు సోమవారం తిరుమలకు వచ్చారు. తనకు వైకుంఠ ఏకాదశి వీఐపీ టికెట్లు ఇవ్వలేదంటూ స్థానిక పద్మావతి అధితిగృహం వద్ద అధికారులపై మండిపడ్డారు. అతిధి గృహం వద్ద ఉన్న సిబ్బందిని తాను మాజీ ఎమ్మెల్యే అయినా..కనీసం మర్యాద చూపించటం లేదని ఫైర్ అయ్యారు.

జెఈవో శ్రీనివాసరాజు తోనూ వాగ్వాదానికి దిగారు. పాస్‌లు ఎవరికి ఇస్తున్నారు..ఎవరి జోక్యంతో ఇదంతా జరుగుతోందని ప్రశ్నిం చారు. తనకు పాస్ ఇవ్వక పోవటం పై జెఈవో ను నిలదీసారు. అక్కడ ఉన్న సిబ్బంది నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా నాగేశ్వర రావు మాత్రం వారి మాట వినలేదు.
టిటిడి సభ్యులు..అధికారులు పూర్తిగా న్యాయమూర్తులు, ఇతర ప్రముఖుల సేవలో అధికారులు తరిస్తున్నారంటూ ఆగ్రహించారు. జేఈవో శ్రీనివాసరాజును గట్టిగా ప్రశ్నించారు.. జేఈవో జోక్యం చేసుకుని పరిమిత సంఖ్యలోనే వీఐపీ టికెట్లు కేటాయిస్తున్నామని, కేవలం ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే టికెట్లు ఇస్తున్నామని సర్ధిచెప్పే ప్రయత్నం చేసారు. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే తగ్గకపోవటంతో ఈవోతో మాట్లాడుకోమంటూ జేఈవో అక్కడినుంచి వెళ్లిపో యారు. ఈవో తోనే అన్ని విషయాలు తేల్చుకుంటానంటూ నాగేశ్వరరావు హెచ్చరించారు.
-
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications