ఏపీలో ప్రారంభమైన బీజేపీ గేమ్..!? మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో స్టార్ట్.. ? నెక్స్ట్ ఎవరు ?
బీజేపీ ఏపీలో చేరికలకు శ్రీకారం చుట్టింది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చెయ్యాలని భావిస్తున్న బీజేపీ అందులో భాగంగా పావులు కదుపుతుంది. టీడీపీ నుండి, కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరే వారిపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా వలసలు స్టార్ట్ అయ్యాయి . అరకు మాజీ ఎంపీ, జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత .. జనజాగృతి పార్టీ బీజేపీలో విలీనం
న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కొత్తపల్లి గీత బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతే కాదు ఆమె గత ఏడాది ఆమె స్థాపించిన జనజాగృతి పార్టీని కూడా బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు కొత్తపల్లి గీత. అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో ప్రత్యేకంగా భేటీ అయిన ఆమె ఇక తానుబీజేపీలో చేరే అంశం, పార్టీ విలీనంతోపాటు భవిష్యత్ లో తనకు న్యాయం చేయాలంటూ రామ్ మాధవ్ ను కోరినట్లు తెలుస్తోంది. అనంతరం రామ్ మాధవ్ నేతృత్వంలో అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. కమలం గూటికి చేరారు.
Recommended Video


వైసీపీ నుండి టీడీపీకి ఫిరాయించిన ఎంపీ .. టికెట్ రాక సొంత పార్టీ పెట్టి ఓటమి పాలైన గీత
2014 ఎన్నికల్లో కొత్తపల్లి గీత జగన్ పార్టీ అయిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరకు లోక్ సభ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఫిరాయింపులలో భాగంగా కొత్తపల్లి గీత టీడీపీకి వైపు ఫిరాయించారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ గీత తనకు టికెట్ రాదనీ తెలియటంతో ఆమె జనజాగృతి పార్టీని స్థాపించి పోటీ చేసి ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఇప్పుడు బీజేపీలో చేరారు .

టీడీపీ టార్గెట్ గా బీజేపీ వ్యూహం .. చేరికలు స్టార్ట్ అయినట్టేనా ?
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్య నాయకులను ప్రభావితం చెయ్యటానికి చాలా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి చాలా మంది మాజీ ఎంపీలు , ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లో ఉన్నారని ,అలాగే టీడీపీ నుండి కూడా చేరికలు ఉంటాయని చెప్తున్నారు. ఇక ఆ ప్రయత్నంలో తొలి అడుగు కొత్తపల్లి గీత రూపంలో పడింది. ఆమె బీజేపీలో చేరింది. భవిష్యత్ లో ఇంకా చాలా మంది నేతలు బీజేపీలో చేరే అవకాశం వుంది. బీజేపీ టీడీపీ ప్లేస్ ను రీ ప్లేస్ చెయ్యాలనే ఆలోచనలో టీడీపీ టార్గెట్ గా ఏపీలో పావులు కదుపుతుంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications