Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో అధికారం ఎవరిది - లగడపాటి ఆసక్తికర అంచనాలు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం పీక్ కు చేరింది. సీఎం జగన్ తమ పార్టీ అభ్యర్దుల ఖరారు వేగవంతం చేసారు. టీడీపీ, జనసేన పొత్తుతో జగన్ ను ఓడించటం ఖాయమనే ధీమాతో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి షర్మిల ఎంట్రీతో ఏపీలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని మాజీలను ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలోనే ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏపీలో ఎన్నికల పోరు పై తన అంచనాలను వెల్లడించారు.

లగడపాటి విశ్లేషణ :చాలా రోజుల తరువాత లగడపాటి రాజకీయాల పైన స్పందించారు. పూర్తిగా తన వ్యాపారాలకే పరిమితమైన లగడపాటి తాజాగా రాజమండ్రి వచ్చారు. మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ తో సమావేశమయ్యారు. లగడపాటి టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. దీని పైన ఆయన స్పందించారు. తనకు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. గతంలో లగడపాటి సర్వేలకు ప్రాచుర్యం ఉండేది. 2019 ఎన్నికల్లో లగడపాటి సర్వే అంచనాలు తప్పటంతో అప్పటి నుంచి ఆయన సర్వేలకు దూరంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు ఏపీ ఎన్నికలు హోరా హోరీగా కనిపిస్తున్న సమయంలో తన లగడపాటి ఆసక్తికర విశ్లేషణ చేసారు.

Ex MP Lagadapti Rajagaopal preditcions on AP Elections war between CM Jagan and Chandra Babu

ఎన్నికల పోరు ఇలా : ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్యే ఎన్నికల సమరం ఉంటుందని స్పష్టం చేసారు. తమిళనాడు తరహాలోనే ఏపీలోనూ ఎన్నికల రాజకీయం ఉంటుందని చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. తాను ఎలాంటి సర్వేలు చేయటం లేదన్నారు. అయితే, ప్రజల మూడ్ ఏంటనేది మాత్రం గుర్తించటం కష్టమని విశ్లేషించారు. ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. షర్మిల ఎంట్రీతో జగన్ ఓటింగ్ చీలిక వచ్చి తమకు మేలు జరుగుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అయితే, షర్మిల రాకతో జగన్ వ్యతిరేక ఓటు మాత్రమే చీలుతుందనేది వైసీపీ ముఖ్య నేతల విశ్లేషణ. తాము పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ పైనే నమ్మకంతో ఉన్నామని చెబుతున్నారు.

Ex MP Lagadapti Rajagaopal preditcions on AP Elections war between CM Jagan and Chandra Babu

మారుతున్న లెక్కలు: ఇప్పుడు లగడపాటి అంచనాలతో ఏపీలో షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించినా కాంగ్రెస్ కు ప్రయోజనం లేదనే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీతో పొత్తు విషయంలోనూ చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఎన్నికల ముందు కంటే తరువాత ఎన్డీఏలో చేరితే ప్రయోజనం అనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అటు పవన్ మాత్రం బీజేపీతో వెళ్లటమే ప్రయోజనకరమని భావిస్తున్నారు. దీంతో, బీజేపీ నుంచి ఒక స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. ఇటు జగన్ ఎలాంటి పొత్తులు లేకుండానే సింగిల్ గానే బరిలోకి దిగుతున్నారు. దీంతో..ఈ సారి గెలుపు పార్టీల కంటే..జగన్, చంద్రబాబు, పవన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+