ఉదయగిరిలో వైసీపీ కొత్త ఇంఛార్జ్ - రాజమోహన్ రెడ్డి భారీ ట్విస్ట్..!!

నెల్లూరు జిల్లాలో వైసీపీ కొత్త ఆపరేషన్ ప్రారంభించింది. ఇప్పటికే వెంకటగిరి..నెల్లూరు రూరల్ కు కొత్త ఇంఛార్జ్ లను నియమించిన వైసీపీ తాజాగా ఉదయగిరి పైన ఫోకస్ చేసింది. మేకపాటి చంద్రశేఖర రెడ్డి వ్యవహార శైలి పైన అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.తన వ్యక్తిత్వం ఏంటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. తాము జగన్ తోనే ఉంటామని స్పష్టం చేసారు. ఇదే సమయంలో సోదరుడు చంద్రశేఖర రెడ్డి స్థానంలో కొత్త ఇంఛార్జ్ ను రాజమోహన్ రెడ్డి సూచించారు.

తమ్ముడిపై అన్న ఆగ్రహం: మేకపాటి చంద్రశేఖరరెడ్డి పైన ఆయన అన్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తమ్ముడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓట్ చేయడం చాలా బాధ కలిగించిందన్నారు. చంద్రశేఖర్ రెడ్డి డబ్బులు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశాడు కాబట్టే పార్టీ అతన్ని సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. ఆయన డబ్బులు తీసుకోకపోతే పార్టీ ఎందుకు సస్పెండ్ చేస్తుందన్నారు. తనకు ముందుగా సమాచారం తెలిసి వారించే ప్రయత్నం చేసానని చెప్పుకొచ్చారు. క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సమంజసమేనని అభిప్రాయ పడ్డారు.

మేకపాటి కుటుంబానికి కలకలం: ఉదయగిరిలో జరుగుతున్న పరిణామాలకు తాను కారణమని చంద్రశేఖర రెడ్డి చెప్పటం పైన సీరియస్ అయ్యారు. తన వ్యక్తిత్వం ఏంటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసిన తర్వాత ఆయన పక్కనున్న వారే దిష్టిబొమ్మలు తగల బెట్టారని చెప్పారు.

mpmekapatirajamohanreddy-

తాము గతంలోనూ జగన్ తోనే ఉన్నామని .. భవిష్యత్ లోనూ జగన్ తోనే కొనసాగుతామని రాజమోహన్ రెడ్డి స్పష్టం చేసారు. తాము టీడీపీలోకి వెళ్తున్నామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. చంద్రశేఖరరరెడ్డి చేసిన పనితో మేకపాటి కుటుంబానికి కలంకం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఉదయగిరి ఇంఛార్జ్ గా కొత్త పేరు: చంద్రశేఖరరెడ్డికి ఆర్దిక ఇబ్బందులు ఉంటే సాయం చేస్తానని చెప్పానని రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. ఇదే సమయంలో వైసీపీలో ఉదయగిరి కొత్త ఇంఛార్జ్ కు సంబందించి చర్చ జరుగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మేకపాటి కుటుంబం పట్టు ఉండటంతో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అనేక మంది రేసులో ఉన్నారు. అందులో ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. సీఎం జగన్ అడిగితే చంద్రశేఖర రెడ్డి కుమార్తె రచనా రెడ్డికి ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వమని చెబుతానని రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రశేఖరరెడ్డి కుమార్తెకు ఇంఛార్జ్ కు సీఎం జగన్ అంగీకరిస్తే సరి కొత్త సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+