రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన హర్ష కుమార్: ఉద్రిక్తత, అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ చేస్తున్న నిరీహార దీక్షను పోలీసులు శనివారం రాత్రి భగ్నం చేశారు. తనను తీసుకు వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ, ఆయన తుపాకీతో నాలుగు రౌండ్లు గాల్లోకి పేల్చాడు.

ఇది సంచలనం సృష్టించింది. పరిస్థితి విషమిస్తుండటంతో స్పెషల్ పార్టీ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య హర్ష కుమార్ అనుచరులను పక్కకు తప్పించారు. హర్ష కుమార్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తుపాకీనీ స్వాధీనం చేసుకున్నారు. కేసు పెట్టారు.

Ex-MP Opens Fire, Threatens Suicide to Evade Arrest

స్మాశనం వాటికకు స్థలం కేటాయించాలని ఈ నెల 10వ తేదీన ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. హర్షకుమార్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అంతకుముందు హర్ష కుమార్ అనుచరులు రణరంగం చేశారు.

కాగా, హర్ష కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం... రెండు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. పుష్కరాలు ప్రశాంతంగా జరిగే పరిస్థితి నగరంలో లేదని ఆయన హెచ్చరించారు. ఆసుపత్రిలో ఉన్న హర్షకుమార్ చికిత్సకు నిరాకరించారు.

English summary
Tension prevailed at the Jampeta Church here Saturday evening when former MP GV Harsha Kumar threatened to commit suicide and fired two rounds in the air from his revolver in an attempt to prevent the police from foiling his hunger strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X