ఈడీ కోర్టుకు హాజరైన సుజనాచౌదరి
మాజీ ఎంపీ, భారతీయ జనతాపార్టీ నేత సుజనా చౌదరిని మనీ లాండరింగ్ కేసు వెంటాడుతోంది. కొన్నేళ్లుగా తీవ్రమైన ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వం ఇటీవలే ముగిసింది. పదవి కోల్పోయిన కొద్దిరోజులకే ఈడీ తన దర్యాప్తులో దూకుడు పెంచడం విశేషం. శుక్రవారం చెన్నైలోని ఆర్థిక నేరాల కోర్టు విచారణకు సుజనా చౌదరి హాజరయ్యారు.
జాతీయ బ్యాంకుల్ని వందల కోట్ల రూపాయలకు మోసం చేసిన కేసు విచారణకు సుజనా హాజరయ్యారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైన అనంతరం సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్‌తోపాటు తెలంగాణకు చెందిన గరికపాటి మోహన్‌రావు పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొన్నాళ్ల క్రితమే వీరి పదవీ కాలం ముగిసింది. పదవి పోగానే సుజనా చౌదరికి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఆయనపై నమోదైన అభియోగాలకు సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదేశించడంతో శుక్రవారం ఆయన చెన్నైలోని ఆర్ధిక నేరాల న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.

రూ.5,700కోట్ల రుపాయల విలువైన ఆర్ధిక నేరాలు, మనీ లాండరింగ్ అభియోగాలకు సంబంధించి 2018 నవంబరులో సుజనాపై ఈడీ కేసులు నమోదు చేసింది. సుజనా చౌదరి నివాసంతో పాటు కార్యాలయాలు, హైదరాబాద్, ఢిల్లీతోపాటు 8 ప్రదేశాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసింది. వీటితోపాటు
ఫెమా నిబంధనల ఉల్లంఘనపై డీఆర్ఐ, సీబీఐ కేసులు కూడా నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications