ఏపీలో మందుబాబుల పండుగ - ఆ బ్రాండ్ల ఎంట్రీతో..!!

ఏపీలో మందుబాబులు పండుగ చేసుకుంటున్నాయి. మద్యం అమ్మకాల్లో కొత్త రికార్దులు నమోదు అవుతున్నాయి. ఒకే ఏడాదిలో మద్యం అమ్మకాలు రూ 30 వేల కోట్ల మార్క్ ను దాటేసాయి. ఏపీ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత బ్రాండెడ్ మద్యం తిరిగి అందుబాటులోకి తీసుకురావ టంతో పాటుగా.. రూ 99 కే మద్యం వినియోగంలోకి వచ్చింది. దీంతో, ఒక్క సారిగా మద్యం అమ్మ కాలు పెరిగాయి. ఇదే సమయంలో తాజాగా ప్రభుత్వం మరో నిర్ణయానికి మంత్రివర్గ భేటీలో ఆమోద ముద్ర వేసింది.

బ్రాండ్ల ఎంట్రీతో
ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. సగటున రాష్ట్రంలో ప్రతీ రోజు రూ 83 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్న ట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2024-25లో పెరిగిన విక్రయాల జోరు పెరిగింది. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో రూ.30వేల కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2023-24తో పోలిస్తే 2024-25లో 9.1శాతం అమ్మకాలు పెరిగాయి. కానీ విలువ మాత్రం కేవలం 0.34శాతం మాత్రమే పెరిగింది. కొత్తగా క్వార్టర్‌ రూ.99 మద్యం బ్రాండ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టడం, పలు బ్రాండ్లు ధరలు తగ్గించుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గినట్టు మద్యం తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

excise-creates-new-record-with-30-thousand-cr-of-liquor-sales-in-2024-25

అమ్మకాలు ఇలా
2023-24లో రూ.30వేల కోట్ల అమ్మకాలు నమోదైనప్పుడు రూ.25,082 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది స్వల్పంగా విలువ పెరిగి రూ.30,183 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో అంతకుముందు ఏడాది స్థాయిలోనే ఆదాయం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పుడు దరఖాస్తు రుసుముల రూపంలో రూ.1,800 కోట్లు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్వార్టర్‌ రూ.99 మద్యం అందుబాటులోకి వచ్చింది. మొత్తం అమ్మకాల్లో రూ.99 బ్రాండ్ల వాటా 30శాతానికి చేరింది. 2023-24లో 4.55కోట్ల కేసులు అమ్మగా, 2024-25లో 4.97కోట్ల కేసుల అమ్మకాలు నమోదయ్యాయి. లిక్కర్‌ 7.38శాతం, బీరు 14.13శాతం పెరిగింది.

Take a Poll

తాజా నిర్ణయం
మద్యం అమ్మకాల్లో పరిమాణం పరంగా చూస్తే 2023-24తో పోలిస్తే 25.02లక్షల కేసుల లిక్కర్‌, 16.47లక్షల కేసుల బీరు అమ్మకాలు పెరిగాయి. అత్యధికంగా కర్నూలులో 13.63శాతం, చిత్తూ రులో 11.71శాతం, శ్రీసత్యసాయిలో 10.22శాతం మేర అమ్మకాలు పెరిగాయి. కాగా, అనకాపల్లిలో 1.77శాతం, శ్రీకాకుళంలో 1.39శాతం, పార్వతీపురం మన్యంలో 1.34శాతం, నెల్లూరులో 1.32శాతం మేర అమ్మకాలు తగ్గాయి. ఇక.. ప్రభుత్వం తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజు రూ.25 లక్షలకు కుదిస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. మద్యం అమ్మకాల వేళ బెల్టు షాపులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం బెల్టు షాపులను ఉపేక్షించేది లేదని చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+